మరో కన్నడ సినిమాపై మనసు పడ్డ సమంత

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన సమంత పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతుంది.ఎక్కువగా స్టార్ హీరోలకి కాంబినేషన్ కి వెళ్ళే ప్రయత్నం చేయకుండా సోలోగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది.

 Samantha Concentrate To Remake Kannada Movie Dia, Tollywood, South Cinema, Akkin-TeluguStop.com

యూటర్న్ సినిమా నుంచి ఆమె నటిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మొదలెట్టింది.కన్నడ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన యూ టర్న్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు.

అయిన కూడా మరోసారి సోలోగా తన ఇమేజ్ తోనే ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.అలాగే మజిలీ, రంగస్థలం లాంటి సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.

ఇప్పుడు సమంత మరో కన్నడ మూవీపై మనసు పడింది.

ఇటీవల కన్నడంలో దియా అనే సినిమా లో బడ్జెట్ లో ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.తాజాగా ఆమె దియా సినిమా చూసిందట.ఆ సినిమా నచ్చడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారం.దియా చిత్ర రీమేక్‌ రైట్స్‌ని ఓ పెద్ద నిర్మాత భారీ ఆఫర్‌తో తీసుకున్నట్టు తెలుస్తోంది.

సమంత కోసమే ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

వరుస రీమేక్ లతో సమంత నటిగా ప్రూవ్ చేసుకుంటున్న ఒక్క ఓ బేబీ తప్ప మరే సినిమా కూడా హిట్ కాలేదు.మరి ఓ అమ్మాయి ఫెయిల్యూర్ లవ్ స్టొరీతో రాబోతున్న ఈ సినిమా సమంతకి ఎంత వరకు హిట్ ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube