టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ.
ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఆ సిరీస్ విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా.
ఇటీవలే సిరీస్ ట్రైలర్ కొందరిని ఆకట్టుకోగా.మరికొందరు సిరీస్ పట్ల వివాదానికి దారి తీశారు.
రాజ్ డీకే దర్శకత్వంలో విడుదల కానున్న వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్ 2‘.ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ మంచి సక్సెస్ అందుకోగా.ప్రస్తుతం సెకండ్ సీజన్ లో సమంత కూడా నటించింది.ఇందులో కీలక పాత్రలో నటించిన సమంత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇందులో సమంత టెర్రరిస్టుగా కనిపించగా.ఈ సిరీస్ లో తమిళ టైగర్లను వ్యతిరేకంగా చూపిస్తున్నారని తమిళ ప్రజలు తీవ్రమైన అభ్యంతరాలు చేశారు.
అంతే కాకుండా ఈ సిరీస్ ను అడ్డుకోవడానికి లేఖ కూడా రాయగా.ఈ సిరీస్ గురించి డైరెక్టర్ రాజు డీకే స్పందించాడు.ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావద్దని తెలిపాడు.ఇదిలా ఉంటే జూన్ 4న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
ఈ సందర్భంగా నటుడు మనోజ్ బాజ్ పేయ్ ఓ మీడియాతో మాట్లాడగా.అందులో సమంత గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ సిరీస్ లో నటించినందుకు ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపించిందని తెలిపారు.
తాను చెన్నై లో షూటింగ్ కోసం అడుగు పెట్టే సరికి సమంత అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలిపాడు.అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందని, ఫిజికల్ గాను శిక్షణ తీసుకొని ఉందని తెలిపాడు.ఇక ఆమె అంతలా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉంటే.
తను మాత్రం ఇంకా ఏమీ మొదలు పెట్టలేదని, మళ్లీ రిహార్సల్ చేయాల్సి ఉంటుందేమో అని భయం వేసిందని తెలిపాడు.
ఇక ఈ సిరీస్ లో తన నటన కాన్ఫిడెంట్ గురించి మాట్లాడుతున్న మనోజ్ బాజ్ పేయ్ కామెంట్స్ పై సమంత స్పందించింది.
అవన్నీ నా మాటలే అంటూ.మీరు నా మాటలను మొత్తం కాపీ కొడుతున్నారని అతని పై కామెంట్స్ చేసింది.
అంతేకాకుండా తను గొప్ప నటుడు అంటూ, ఈ సిరీస్ లో తాను ఎంతో అద్భుతంగా నటించారో, తను ఏం చేశారో అందరు చూడాల్సిందే అంటూ అతడిని పొగిడింది సమంత.అంతేకాకుండా ఆ క్షణం కోసం తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో నటించిన సమంతకు. కేవలం ట్రైలర్ చూసినందుకే బాలీవుడ్ దర్శకులు పలు అవకాశాలు అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ సిరీస్ డైరెక్టర్ రాజ్ డీకే కూడా.సమంత ఓకే అంటే తనతో సినిమా చేస్తాను అంటూ తెలిపాడు.
ఇక సమంత కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.