హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న సమంత

చిత్రపరిశ్రమలో మొదటి నుంచి కూడా వేతనంలో హీరో, హీరోయిన్స్ విషయంలో వ్యత్యాసం ఉంటుంది.హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం కూడా హీరోయిన్స్ కి ఇవ్వరు.

 Samantha Comments On Heroines Remuneration-TeluguStop.com

అయితే సినిమాలలో హీరోలతో సమానమైన పాత్రలని హీరోయిన్స్ చేస్తూ ఉంటారు.హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా చాలా వరకు సినిమాలు ఉండవు.

అయినా కూడా వారికిచ్చే ప్రాధాన్యత, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా తేడా చూపిస్తూ ఉంటారు.దీనికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతూ ఉంటారు.

 Samantha Comments On Heroines Remuneration-హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాల బిజినెస్ అనేది హీరోల ఇమేజ్ బట్టి వెళ్తుంది కాబట్టి వారికి అధిక రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుందని వాదిస్తూ ఉంటారు.అయితే హీరోయిన్స్ ఇమేజ్ ద్వారా కూడా బిజినెస్ అయ్యే సినిమాలు ఉంటాయి.

అయినా కూడా వారికిచ్చే రెమ్యునరేషన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన కూడా హీరోయిన్స్ వారి బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్లు రెమ్యునరేషన్ పెంచితే వెంటనే పలానా నటి రెమ్యునరేషన్ పెంచేసింది అంటూ ప్రచారం మొదలు పెడతారు.

హీరోల రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఇలాంటి ప్రచారం చాలా తక్కువగా జరుగుతుంది.

మినిమం రేంజ్ హీరో 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటే స్టార్ హీరోయిన్ అయినా కూడా హీరోయిన్స్ కి 2 నుంచి 3 కోట్లకి మించి సౌత్ లో రెమ్యునరేషన్ ఇవ్వరు.

అయితే ఈ వ్యత్యాసంపై చాలా మంది హీరోయిన్స్ గతంలో మీడియాలో సంచలన వాఖ్యలు చేశారు.బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఈ విషయంలో పోరాడి మరి తమ రెమ్యునరేషన్ స్టాండర్డ్స్ ని పెంచుకున్నారు.

అక్కడ హీరోయిన్స్ కి అత్యధికంగా 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు.అయితే సౌత్ లో ఆ పరిస్థితి ఇంకా లేదనే చెప్పాలి.ఈ విషయంపై తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికర వాఖ్యలు చేసింది.ఇండస్ట్రీలో టాప్‌ ట్వంటీలో లేని కథానాయకుడికి ఇచ్చే రెమ్యునరేషన్‌ కన్నా టాప్‌ త్రీలో ఉన్న కథానాయికకు ఇచ్చే పారితోషికం తక్కువగా ఉంటుందని సమంత వ్యాఖ్యానించింది.

‘హీరోలు ఎంత రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినా పెద్దగా అభ్యంతరం చెప్పరు.పైగా అతను సక్సెస్‌లో ఉన్నాడని సమర్ధిస్తారు.

అదే కథానాయిక అడిగితే అనవసరమైన డిమాండ్స్‌ పెడుతోంది.అత్యాశకు పోతుందనే ముద్ర వేస్తారు.

ఇండస్ట్రీలో కథానాయికలు అధిక పారితోషికాల్ని డిమాండ్‌ చేయడం నేరంతో సమానంగా చూస్తారు అంటూ కీలక వాఖ్యలు చేసింది.

#Samantha #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు