అక్కినేని వారి ఇంటి కోడలుగా సమంత అడుగు పెట్టిన తర్వాత చాలా పద్దతులు మార్చుకుంది.గతంతో పోల్చితే ఇప్పుడు సమంతలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.ఆమె గతంలో మాదిరిగా కాకుండా చాలా హుందాగా ఉంటుందని ఆమె అభిమానులు స్వయంగా చెబుతున్నారు.పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న సమంత మరియు నాగచైతన్యలు ఇటీవల కలిసి నటించిన మజిలీ చిత్రంను సూపర్ హిట్ చేసుకున్నారు.
ఇక గత కొన్నాళ్లుగా అందరి నుండి కూడా సమంత ఒక ప్రశ్న ఎదుర్కొంటుంది.

ఫ్యాన్స్, మీడియా మరియు ఫ్యామిలీ నుండి ఈమెకు తరుచుగా ఎదురవుతున్న ప్రశ్న అమ్మ ఎప్పుడు కాబోతున్నారు.ఈ ప్రశ్నకు సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం నాగచైతన్య మరియు నేను మ్యారేజ్ లైఫ్‌ను మరియు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాం.పిల్లలకు కాస్త సమయం కావాలి.
వారు వచ్చిన తర్వాత పూర్తిగా వారికే కేటాయించాలని భావిస్తున్నాను.అందుకే మూడు సంవత్సరాల వరకు పిల్లల ప్రస్థావన తీసుకు వచ్చే ఉద్దేశ్యం లేదు అంటూ సమంత చెప్పుకొచ్చింది.పాపం చైతుకు మూడేళ్ళ వరకు తండ్రి అయ్యే అదృష్టం లేదన్నమాట.

ఈ ఏడాది మజిలీ మరియు ఓబేబీ చిత్రాలతో అలరించిన సమంత కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆలస్యం చేస్తోంది.లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓకే చెప్పడంతో పాటు కమర్షియల్ సినిమాలకు కూడా ఈమె ఓకే చెప్పేందుకు సిద్దంగా ఉంది.
అయితే మంచి కథ మరియు పాత్ర కావాలంటూ డిమాండ్ చేస్తోంది.తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ఇంకా మూడు సంవత్సరాల వరకు హీరోయిన్గా కొనసాగనున్నదన్నమాట.