చైతూను అంత మాట అనేసిందేంటి.. సమంతపై విమర్శలు

అక్కినేని కపుల్‌ నాగచైతన్య మరియు సమంతలు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ చిత్రం కోసం ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

 Samantha Comments On Chaitanya In A Interview-TeluguStop.com

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు కలిసి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.ముఖ్యంగా నాగచైతన్య గురించి సమంత పలు విషయాలను చెప్పింది.

అదే సమయంలో నాగచైతన్య గాలి తీసేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఇద్దరి అన్యోన్యంకు ఈ ఇంటర్వ్యూ సాక్ష్యంగా నిలుస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

ఇక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ… చైతూతో కొన్ని సార్లు చాలా బోరింగ్‌గా ఉంటుంది.ఎక్కువ శాతం జోవియల్‌గా చైతూ ఉండడు.చిన్న విషయాన్ని లేదా పెద్ద విషయాన్ని రెంటిని కూడా ఒకేలా చూడగలుగుతాడు.సంతోషకర విషయం ఏదైనా తెలిసినా కూడా చాలా నార్మల్‌గా రియాక్ట్‌ అవుతాడు.

అయితే నేను మాత్రం అలా కాదు.నేను ఏదైనా సంతోషకర విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తాను.

ఆ సమయంలో చైతూ నాకు బోరింగ్‌గా అనిపిస్తాడు అంటూ సమంత చెప్పుకొచ్చింది.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘మజిలీ’ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శివ నిర్వాన గట్టిగా చెబుతున్నాడు.విభిన్నమైన కథాంశంతో ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

సినీ విశ్లేషకులను ఆకర్షిస్తున్న ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంలో అక్కినేని ఫ్యాన్స్‌ ఉన్నారు.ఈ జంట కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube