టాలీవుడ్ క్యూట్ కపుల్ చైతన్య సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాగా చైతన్య సమంత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.సమంత నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.వెబ్ సిరీస్ లతో కూడా సమంత ప్రతిభ ఉన్న నటి అని ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.50కు పైగా సినిమాలలో సమంత నటించినా పెళ్లైనా ఈ హీరోయిన్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
సమంత నటించిన ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్ర ఆమెకు పాపులరిటీని మంచిపేరు తెచ్చిపెట్టింది.తాజాగా ఈ బ్యూటీ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమంత కుటుంబం, ప్రేమ, కెరీర్ గురించి మాట్లాడుతూ తన తండ్రి తెలుగు కుటుంబానికి చెందిన వారేనని చెప్పుకొచ్చారు.ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలో స్థిరపడ్డారు.పాకెట్ మనీ కోసం సమంత యాడ్లలో నటించడం గమనార్హం.
తెలుగులో ఏ మాయ చేశావె సినిమాలో అవకాశం రావడంతో హీరోయిన్ గా సమంత కెరీర్ మొదలైంది.
చైతన్య కంటే తాను చైతన్య ప్రేమలో పడ్డానని సమంత అన్నారు.ఒకరికి తెలీకుండా మరొకరం ప్రేమ అనే ఫీలింగ్ ను ఎంజాయ్ చేశామని చైతన్య తనకు ప్రేమను ప్రపోజ్ చేశారని సమంత అన్నారు.
ఆ విధంగా చైతన్య, సమంత ప్రేమించుకోగా పెద్దలు ఒప్పుకోవడంతో వివాహం చేసుకున్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం సమంత చైతన్య వివాహం జరగగా పిల్లల్ని ఎప్పుడు కంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.టాలీవుడ్ క్రేజీ కపుల్ గా సమంత నాగ చైతన్య పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.