చైతన్యను వదిలినా అక్కినేని ఫ్యామిలీని వదలని సమంత.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్య ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు అక్కినేని అభిమానుల దగ్గర ఇప్పటికీ సరైన సమాధానం లేదు.అయితే సమంత చైతన్యకు దూరమైనా అక్కినేని ఫ్యామిలీకి మాత్రం దగ్గరగానే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 Samantha Comments About Akhil Agent Teaser Details, Akhil , Samantha, Agent Movi-TeluguStop.com

తాజాగా అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీకి అచ్చొచ్చిన తేదీలలో ఒకటైన ఏప్రిల్ 28వ తేదీన ఏజెంట్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి ప్రకటన రాగా సామ్ బర్త్ డే రోజున అఖిల్ మూవీ రిలీజ్ కానుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

వదినపై మరిదికి వాత్సల్యం, అభిమానం ఎక్కువగానే ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు అఖిల్ ఏజెంట్ 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

Telugu Akhil, Akhil Samantha, Akkineni Akhil, Akkineni, Naga Chaitanya, Samantha

టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించగా ఆ టీజర్ ను సమంత లైక్ చేయడంతో పాటు బీస్ట్ మోడ్ అంటూ కామెంట్ చేశారు.అఖిల్ పై తనకు ఏ స్థాయిలో అభిమానం ఉందో సమంత ఈ విధంగా చెప్పకనే చెప్పేశారు.మరోవైపు అఖిల్ ఏజెంట్ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.ఏజెంట్ సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Telugu Akhil, Akhil Samantha, Akkineni Akhil, Akkineni, Naga Chaitanya, Samantha

అఖిల్ సినిమాలో నటించే అవకాశం వస్తే సమంత కూడా నటించే అవకాశాలు అయితే ఉన్నాయి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ స్టైలిష్ మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఏ రేంజ్ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube