మంత్రి కేటీఆర్ పై సమంత కామెంట్.. క్రేజీ పోస్ట్ తో రిప్లై?

గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సెలబ్రిటీ పేరు ఏదైనా ఉందా అంటే అందరూ సమంత పేరు చెబుతారు.అయితే విడాకులే ప్రకటన తర్వాత సమంత పూర్తి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

 Samantha Comments On Minister Ktr Reply With Crazy Post Details, Samantha, Toll-TeluguStop.com

నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పులిస్టాప్ పడటంతో ఆ బాధ నుంచి బయట పడటానికి సమంత ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.ఇకపోతే ఇప్పటివరకు పలు సినిమాల గురించి సామాజిక అంశాల గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించే సమంత తాజాగా రాజకీయాలపై తన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సమంత కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికి వస్తే తాజాగా తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిల్లల సంక్షేమం కోసం బాల రక్షక్ అనే అంబులెన్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తనని అభినందిస్తూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఆపదలు పిల్లలను ఆదుకోవడానికి జిల్లాకు ఒకటి చొప్పున 33 అంబులెన్సులను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Telugu Replay, Samantha, Shaakuntalam, Tollywood-Movie

ఇక సమంత ఈ పోస్ట్ పై స్పందించారు.ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన పోస్టులను సమంత తన ఇన్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ.దండం పెడుతూ.క్లాప్స్ కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అలాగే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube