బాబోయ్‌ మరీ ఇంత స్పీడ్‌ ఏంటీ సామ్‌... మేడమ్‌ నందిని వర్కౌట్‌ అయ్యేనా ఇది?  

Samantha Clarifies About Madam Nandini Movie-

పెళ్లి తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెల్సిందే.ప్రతి సినిమాలో కూడా తన నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేస్తోంది.

Samantha Clarifies About Madam Nandini Movie-

ఇటీవలే నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ అనే చిత్రాన్ని ఈ అమ్మడు చేసిన విషయం తెల్సిందే.శివ నిర్వాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం ప్రారంభం అయినప్పటిన ఉండి షూటింగ్‌ ముగిసే వరకు తెగ సందడి చేసింది.సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది.

సినిమా ఆన్‌ లొకేషన్‌ సీన్స్‌ లీక్‌ అవ్వడం, సినిమాలోని విషయాలను బయటకు చెప్పడం వంటివి చేసేవారు.

Samantha Clarifies About Madam Nandini Movie-

ఇదే సమయంలో సమంత ‘ఓ బేబీ’ అనే చిత్రాన్ని చేసింది.అప్పుడప్పుడు కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ అనే చిత్రానికి సమంత రీమేక్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమాను సురేష్‌ బాబు నిర్మించనున్నాడు, నందిని రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

కాని ఎప్పుడు కూడా షూటింగ్‌ ప్రారంభం గురించి వార్తలు రాలేదు.కాని తాజాగా అనూహ్యంగా ఆ సినిమా గురించిన ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది.

ఆ రీమేక్‌ షూటింగ్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆశ్చర్యకరంగా సినిమా షూటింగ్‌ అయిపోయింది అంటూ ప్రకటించారు.

నందిని రెడ్డి ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించింది.షూటింగ్‌ పూర్తి అంటూ కొన్ని స్టిల్స్‌ను కూడా విడుదల చేశారు.ఈ చిత్రంలో సమంతతో పాటు సీనియర్‌ నటి లక్ష్మీ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మిస్‌ గ్రానీలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.షూటింగ్‌ పూర్తి అయిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సమంతకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.ఇంత తక్కువ సమయంలో చేసిన సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా, నందిని రెడ్డి ఈ సినిమాను బాగా తీసి ఉంటుందా, నిర్మాతలకు ఈ సినిమా వర్కౌట్‌ అయ్యేనా అంటూ పలు ప్రశ్నలు జనాలను తొలుస్తున్నాయి.

.

తాజా వార్తలు