ఆ ఒక్క సీన్ కు సమంత 10 లక్షలు తీసుకుంది అంట.! ఎవరితో ఛాలెంజ్ చేసిందంటే.?  

Samantha Charged 10 Lakhs For Rangasthalam Kiss Scene-

`రంగ‌స్థ‌లం` సినిమా రెండో వారంలో కూడా త‌న స‌త్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లో కూడా భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. కాగా, ఈ సినిమాలోని రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత మ‌ధ్య చిత్రీక‌రించిన ముద్దు సీన్ గురించి ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నాడు...

ఆ ఒక్క సీన్ కు సమంత 10 లక్షలు తీసుకుంది అంట.! ఎవరితో ఛాలెంజ్ చేసిందంటే.?-Samantha Charged 10 Lakhs For Rangasthalam Kiss Scene

సాధార‌ణంగా ముద్దు సీన్‌లంటే హీరోయిన్లు డ‌బ్బులు అద‌నంగా డిమాండ్ చేస్తుంటారు.

`రంగ‌స్థ‌లం` సినిమాలో మాత్రం ముద్దు సీన్ వ‌ల్ల సుకుమార్‌కు అద‌నంగా డ‌బ్బులు క‌లిసొచ్చాయ‌ట‌. ఆ ముద్దు సీన్ తీసినందుకు సుకుమార్‌కు నిర్మాత ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఎక్స్‌ట్రాగా ఇచ్చార‌ట‌. ఆ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సుకుమార్ వెల్ల‌డించాడు.

`సినిమాలో చాలా క్లిష్ట‌మైన సీన్ అది. హీరోహీరోయిన్లు త‌మ ప్రేమ‌ను ఒక‌రికొక‌రు వ్య‌క్త‌ప‌రుచుకోవాలి. అదే టైమ్‌లో పోలీసులు వ‌చ్చి చెర్రీని తీసుకుపోవాలి..

ఆ సీన్ గురించి రెండ్రోజులు ఆలోచించా. ఆ ముద్దు సీన్ ఎలా తీయాలా అని తెగ ఆలోచించా. `ఆ ముద్దు సీన్ తీయ‌డం నీ వ‌ల్ల కాదు.

ఒకవేళ తీస్తే నీకు ప‌దిల‌క్ష‌లు ఎక్స్‌ట్రాగా ఇస్తాన‌`ని నిర్మాత చాలెంజ్ చేశారు. దాంతో ఆ సీన్‌ను చాలెంజ్‌గా తీసుకుని కేవలం 30 నిమిషాల్లో ఆ ముద్దు సీన్‌ను తీశా. ఆ ముద్దు సీన్ గురించి స‌మంత‌కు మాత్ర‌మే చెప్పా. చెర్రీకి ముందుగా చెప్ప‌లేదు.

దీంతో ఆ సీన్‌లో చెర్రీ చాలా స‌హ‌జంగా న‌టించాడ‌`ని సుకుమార్ చెప్పాడు.