విడిపోతున్నామని చెబితే లక్షల లైకులా..జనాలు ఏమాలోచిస్తున్నారు?

టాలీవుడ్ తో పాటు ప్రెసెంట్ మిగతా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది చైసామ్ విడాకులు అనే చెప్పాలి.మిగతా విషయాలు కూడా పక్కన పెట్టి మరి న్యూస్ చానల్స్ వారు సమంత నాగ చైతన్య విడాకుల విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ చర్చలు సాగిస్తున్నారు.

 Samantha Chaitanya Divorce Matter Getting Huge Likes In Social Media, Chaysam Di-TeluguStop.com

అయితే ఇది కొత్త విషయమేమి కాదు.సమంత పెట్టె పోస్టుల వల్ల ఈ విషయంపై ఎప్పటి నుండో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా వీరిని డైరెక్ట్ గా ఈ విషయంపై మాట్లాడమని కోరినా ఇద్దరు ఈ విషయం పక్కన పెట్టేసారు.కానీ సమంత మాత్రం తన పోస్ట్ లు ఆపడం లేదు.

ఒకదానికి మించి ఒకటి పెడుతూ రచ్చ రచ్చ లేపింది.అయితే ఎట్టకేలకు ఈ విషయంపై అటు నాగ చైతన్య ఇటు సమంత నోరు విప్పారు.

నిన్న వీరి విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసారు.వారు ఈ బంధం నుండి తప్పుకుని కేవలం స్నేహితులుగానే ఉండబోతున్నామని తెలిపారు.ఈ విషయంపై నిన్నటి నుండి చర్చలు సాగుతూనే ఉన్నాయి.ఎవరికీ తోచిన జడ్జెమెంట్ వారు ఇస్తున్నారు.

ఇక సమంత కూడా తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం వల్ల ఆమె పోస్ట్ కు విపరీతమైన స్పందన వస్తుంది.

Telugu Chaysam Divorce, Divorce, Naga Chaitanya, Netizens, Samantha, Tollywood-M

ఆమె పెట్టిన పోస్ట్ కు నెటిజెన్స్ నుండి లైకులు వెల్లు వెత్తుతున్నాయి.విడిపోయామని పోస్ట్ పెడితే ఇలా ఇన్ని లైకులు రావడం ఏంటి అని అర్ధం కానీ విషయం.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ పోస్ట్ కు 12 లక్షల లైక్స్ వస్తున్నాయి.

ఇది ఏమైనా ఆనందించదగిన విషయమా.పెట్టిన పోస్ట్ ఏంటి ఈ లైక్స్ ఏంటి.

అనే విషయం ఎవ్వరికి అర్ధం కావడం లేదు.

Telugu Chaysam Divorce, Divorce, Naga Chaitanya, Netizens, Samantha, Tollywood-M

అసలు మన జనాలు ఈ పోస్ట్ ను ఎలా అర్ధం చేసుకున్నారు.నిజంగా చదివే ఈ పోస్ట్ కు లైక్స్ కొట్టారా.లేదంటే తమ అభిమాన హీరోయిన్ పెట్టింది కాబట్టి ఆ పోస్ట్ ఏదైనా సరే లైక్ కొట్టాలని కొట్టారా అనేది ఇక్కడ మరొక అర్ధం కానీ విషయం.

తాను ఏం పోస్ట్ పెట్టిందో చదవకుండా ఇలా లైక్స్ కొట్టడం.భావోద్వాగాలతో నిండి ఉన్న ఈ పోస్ట్ ను ఎలా స్పందించాలో చూడకుండా లైక్స్ కొట్టడం అనేది చాలా మందికి అర్ధం కానీ ప్రశ్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube