పెళ్లి కూతురు గెటప్ లో సమంత.. గందరగోళంగా ఉందంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సమంత – నాగచైతన్య ఒకరని చెప్పవచ్చు.సమంత ఒకరికొకరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

 Samantha Bridal Look Photoshoot Is Stunning Samantha, Tollywood, Photoshoot, Bri-TeluguStop.com

వీరి పెళ్లి అనంతరం ఎంతో అందంగా, సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య గత కొంత కాలం నుంచి మనస్పర్ధలు వస్తున్నాయని త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై సమంత, నాగచైతన్య, అక్కినేని కుటుంబం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ప్రస్తుతం చైతు ఫ్యాన్స్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత సోషల్ మీడియా వేదికగా ఎంతో అందంగా పెళ్లికూతురుగా ముస్తాబై ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు విడాకులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ సమంత ఈ విధంగా పెళ్లి కూతురు ఫోటోలతో కనిపించడంతో అభిమానులలో కొంత గందరగోళం నెలకొంది.

Telugu Love Story, Naga Chaitanya, Photoshoot, Sai Pallavi, Samantha, Shakunthal

ఇదిలా ఉండగా సమంత ఒక వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఒక బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ఇలా వధువుగా ముస్తాబై ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సమంత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోల పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ సమంత బ్రైడల్ లుక్ తన పెళ్లి రోజులను గుర్తు చేసే విధంగా ఉందంటే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇలా సమంత సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నప్పటికీ తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఏమాత్రం స్పందించలేదు.

ఇక నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చైతన్య పాల్గొనే ఇంటర్వ్యూలలో కూడా ఇలాంటి ప్రశ్నలు, ప్రస్తావన ఉండకూడదని నాగ చైతన్య తన పీఆర్ టీంని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి వీరిద్దరి మధ్య వస్తున్న వార్తలను ఖండిస్తూ శుభవార్తను ఎప్పుడు తెలుపుతారా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube