టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ లో రెండు మూడు సినిమా లకు ఈమె ఇప్పటికే సైన్ చేసింది.
అలాగే హిందీ వెబ్ సిరీస్ కి కూడా ఈమె ఓకే చెప్పింది అనే సమాచారం అందుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన యశోద మరియు శకుంతలం సినిమా లు విడుదల కాబోతున్నాయి.
ఆ సినిమాల తర్వాత సమంత బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది అంటూ సమాచారం అందుతుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలీవుడ్ లో సమంత చేయబోతున్న మొదటి సినిమా లో ఆమె పాత్ర దెయ్యం పాత్ర గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఒక హర్రర్ కామెడీ స్క్రిప్ట్ కి సమంత ఒకే చెప్పిందని, ఆమె ఎప్పుడూ కనిపించని విధంగా విభిన్నంగా కొత్త పాత్రలో కనిపించబోతుంది అంటూ ఆమె సన్నిహితులు హిందీ సినిమా గురించి చెబుతున్నారు.త్వరలో హిందీలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని కూడా సమాచారం అందుతుంది.తెలుగు మరియు తమిళంలో ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేసిన సమంత ఇక నుండి కేవలం హిందీ సినిమాలే చేస్తుంది అంటూ కొందరు భావిస్తున్నారు.కానీ సమంత సన్నిహితులు మాత్రం సౌత్ లో కూడా వరుసగా సినిమాలు చేయబోతున్నట్లుగా చెప్తున్నారు.
హిందీ లో సినిమాలు చేస్తున్న సౌత్ నుండి వచ్చే ప్రతి ఒక్క ఆఫర్ ని కూడా సమంత పరిగణలోకి తీసుకొని మంచి కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుందని వారు పేర్కొన్నారు.త్వరలోనే మరో తమిళ సినిమా కు సమంత సైన్ చేస్తుందని కూడా వారు తెలియజేశారు.
తెలుగులో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆమె వినియోగించుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.







