ఏం మాయ చేసావే సినిమాతో వెండితెరపై తలుక్కుమన్న ఈ జంట ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.వెండితెరపై వీరిద్దరూ కలిసి నటించే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే.
తెర పై సక్సెస్ అయిన ఈ జంట నిజజీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు.గత పది సంవత్సరాల నుంచి స్నేహాన్ని కొనసాగిస్తూ నాలుగు సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడిపిన సమంత నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరు విడిపోతున్నారు అంటూ వార్తలు రావడం ఎట్టకేలకు ఆ వార్తలు నిజం కావడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసాయి.శనివారం అక్కినేని చైతన్య సమంత సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సాధారణంగా సమంత ఏ విషయాన్నైనా సోషల్ మీడియాతో పంచుకునేటప్పుడు నోట్ కింద కామెంట్ల సెక్షన్లు క్లోజ్ చెయ్యదు.కానీ విడాకుల విషయాన్ని తెలుపుతూ వారు వివాహబంధంలో విడిపోయిన స్నేహబంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ చేసిన నోట్ కింద కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసింది.
అయితే సమంత ఇలా కామెంట్ సెక్షన్ క్లోజ్ చేయడానికి గల కారణం తను చేసిన పోస్ట్ కి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయన్న భయంతోనే ముందుగా అన్నీ ఇలా సెట్ చేసిందా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.అయితే సమంత చేసిన పోస్ట్ కు అధిక మొత్తంలో లైక్స్ రావడం గమనార్హం.ఈ విధంగా ఈ పోస్టుకు లైక్ చేయడంతో వీరిద్దరు విడిపోవాలని చాలా మంది భావిస్తున్నారా?లేక విడిపోయినా కూడా స్నేహ బంధంతో కొనసాగుతానని చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ లైక్ చేస్తున్నారా.అనే విషయం తెలియడం లేదు.
ఏది ఏమైనా సమంత నాగచైతన్య డెసిషన్ చాలా మంది అభిమానులకు బాధ కలిగించిందని చెప్పవచ్చు.