సమంత నువ్వు చాలా లక్కీ అబ్బా..!

టాలీవుడ్‌లో మోస్ట్‌ క్యూట్‌ అండ్‌ లవ్లీ కపుల్‌ ఎవరు అంటే ఎక్కువ శాతం మంది చెప్పే పేర్లు సమంత చైతూ.వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవిషయం తెల్సిందే.

 Samantha, Naga Chaitanya, Birthday, Cake, Holiday, Social Media, Professional-TeluguStop.com

పెళ్లి తర్వాత వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తి స్వేచ్చను సమంతకు ఇచ్చిన చైతూ ఆమె సినిమాల విషయంలో అస్సలు ఇంటర్‌ ఫియర్‌ కాకపోవడంతో పాటు ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్నాడు.

అలాగే హాలీడేస్‌కు వీరిద్దరు తెగ ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి.

క్వారెంటైన్‌ టైంలో కూడా వీరిద్దరు ఎంజాయ్‌ చేస్తున్నారు.

పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ జీవితంను ఆనందిస్తున్నారు.పెళ్లి తర్వాత ఇన్ని రోజులు కలిసి ఒకే ఇంట్లో ఉండటం వీరికి ఇదే ప్రథమం.

ఇక నేడు సమంత పుట్టిన రోజు కావడంతో చైతూ ఆమెను సర్‌ ప్రైజ్‌ చేశాడు. సమంత కోసం ప్రత్యేకంగా కేక్‌ ను తయారు చేసి అర్థరాత్రి 12 గంటల సమయంలో కట్‌ చేయించాడు.

సమంత ఆ సమయంలో కేక్‌ కట్‌ చేసి భర్త బర్త్‌డే విషెష్‌కు హ్యాపీ అయ్యింది.

Telugu Cake, Holiday, Naga Chaitanya, Professional, Samantha-

గతంలో కూడా పలు సార్లు సమంత కోసం చైతూ వంట చేసి పెట్టిన విషయం వీడియోల్లో చూశాం.ఇప్పుడు ఏకంగా కేక్‌ చేసి పెట్టాడు.బర్త్‌డేకు బయట కేక్స్‌ లభించక పోవడం వల్ల సొంతంగా కేక్‌ చేసిన చైతూను నిజంగా అంతా అభినందిస్తున్నారు.

మీరు చాలా గొప్ప వారు చైతూ అంటున్నారు.మీలాంటి భర్త లభించడం సమంత చాలా లక్కీ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొత్తానికి ఈ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు చాలా లక్కీ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube