మామను వెనక్కు నెట్టిన సమంత.. అవాక్కైన ఫ్యాన్స్..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోను దసరా పండుగ రోజున స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున కోడలు సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.సమంత హోస్టింగ్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

 Samantha Hosted Bigg Boss Episode Gets Huge Trp Ratings, Samantha, Bigg Boss Sho-TeluguStop.com

కొందరు సమంత అద్భుతంగా చేసిందని కామెంట్లు పెడితే మరి కొందరు సమంత బిగ్ బాస్ షోకు అన్ ఫిట్ అని అభిప్రాయపడ్డారు.అయితే ఎవరెన్ని కామెంట్లు చేసిన సమంత మాత్రం మామను వెనక్కు నెట్టేసింది.

సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగ్ లు చాలా తక్కువగా ఉన్నాయి.

వీక్ డేస్ లో 5 నుంచి 7 మధ్య రేటింగ్ వస్తుంటే వీకెండ్ లో మాత్రం ఏకంగా 8 నుంచి 9 రేటింగ్ వస్తోంది.అయితే సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్ కు మాత్రం ఏకంగా 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.ఏకంగా మూడున్నర గంటల సమంత అందించిన ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.
నాగార్జున హోస్ట్ చేసిన ఎపిసోడ్ లతో పోలిస్తే సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్లకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో “మామను వెనక్కు నెట్టిన సమంత” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ రేటింగ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం సంతోషంతో ఉన్నారు.

మరి కొందరు సీజన్ 5కు సమంత హోస్టింగ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి తరువాత పరిమితంగానే సినిమాల్లో నటిస్తున్న సమంత బిగ్ బాస్ షోను హోస్ట్ చేసే ఛాన్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్ కు భారీగా టీఆర్పీ రేటింగ్ రావడంతో సామ్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube