ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా సమంత..!- Samantha Becomes 1st Indian Actress To Get Character Emoji

samantha becomes 1st indian actress to get character emoji,naga chaitanya,the family men - Telugu Amazon Prime, Character Emoji, First Indian Actress, Samantha, Tha Family Man Web Series

ఏ మాయ చేశావె సినిమాలో జెస్సీ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ పాత్రతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసేసింది.ఏ మాయ చేశావె సినిమా హిట్ కావడం ఆ సినిమా తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావడంతో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

 Samantha Becomes 1st Indian Actress To Get Character Emoji-TeluguStop.com

మూడేళ్ల క్రితం సమంతకు, నాగ చైతన్యకు వివాహం కాగా పెళ్లి తరువాత కూడా సమంత విజయాలను అందుకుంటూ హీరోయిన్ గా బిజీగా ఉన్నారు.

వెండితెరపై సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సమంత డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ ‌లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నారు.

 Samantha Becomes 1st Indian Actress To Get Character Emoji-ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా సమంత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.ఫిబ్రవరి 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

సమంత ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంతకు అరుదైన గుర్తింపు, ఘనత సొంతమైంది.

అమెజాన్ ప్రైమ్, ట్విట్టర్ వెబ్ సిరీస్ లోని సమంత పాత్రకు సంబంధించిన ఎమోజీని విడుదల చేశారు.ఇలా హీరోయిన్ కు సంబంధించి ఎమోజీ విడుదలైన తొలి భారతీయ నటిగా సమంత గుర్తింపును సంపాదించుకున్నారు.రాజ్, డీకేలు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా ప్రియమణి కూడా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు.సమంత సాధించిన ఈ ఘనత గురించి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నా సమంత వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపడం గమనార్హం.మరోవైపు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

#FirstIndian #Amazon Prime #Character Emoji #ThaFamily #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు