తగ్గేదేలే.. కాశ్మీర్ లో 'ఖుషీ'గా ముగించిన టీమ్ నెక్స్ట్ హైదరాబాద్ అట..

విజయ్ దేవరకొండ.ఈ పేరు మన టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Samantha And Vijay Deverakonda Kushi Shooting Update, Samantha, Vijay Deverakonda, Kushi, Liger , Samantha And Vijay Deverakonda Movie, #vd11,shiva Nirvana-TeluguStop.com

ఇతడు చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ఈయన ఫాలోయింగ్ మాత్రం ఏ యంగ్ హీరోకు లేనంత ఫాలోయింగ్ ఉంది.ఇంతా బయట అనే సంబంధం లేకుండా ఇతడిని ఇండియా అంతా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన లైగర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.

 Samantha And Vijay Deverakonda Kushi Shooting Update, Samantha, Vijay Deverakonda, Kushi, Liger , Samantha And Vijay Deverakonda Movie, #VD11,Shiva Nirvana-తగ్గేదేలే.. కాశ్మీర్ లో ఖుషీ#8217;గా ముగించిన టీమ్ నెక్స్ట్ హైదరాబాద్ అట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంచి ఆ తర్వాత మరొక రెండు పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.

లైగర్ తర్వాత కూడా విజయ్ పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించి ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరొక సినిమా ప్రకటించాడు.

ఈ రెండు సినిమాల్లో ముందుగా శివ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ కి జోడీగా సమంత నటించనుంది.అందుకే అంచనాలు భారీగా పెరిగాయి.

మొదటిసారి కొత్త జోడీ కావడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

ఈ సినిమా కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.అయితే అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యి సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ కూడా వస్తున్నట్టు శివ నిర్వాణ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

దీంతో టీమ్ అంతా ఎంత వేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తుందో అర్ధం అవుతుంది.శివ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి అయినట్టు టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసాడు.

ఈ ఫొటోల్లో విజయ్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.

మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube