కమర్షియల్ యాడ్ లో సమంత, నాగ చైతన్య.. వైరల్ ఫోటో!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ కపుల్ గా సమంత, నాగ చైతన్య ముందున్నారు.వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Samantha And Naga Chaitanya Go Traditional For Brand Shoot-TeluguStop.com

ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఓ సినిమాలో నటించగా.పెళ్లికి ముందు పలు సినిమాలలో నటించారు.అంతేకాకుండా వీరిద్దరు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటారు.

2010లో ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఈ జంట కలిసి నటించగా.ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిగ వంటి సినిమాలలో జంటగా నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటించిన సంగతి తెలిసిందే.

 Samantha And Naga Chaitanya Go Traditional For Brand Shoot-కమర్షియల్ యాడ్ లో సమంత, నాగ చైతన్య.. వైరల్ ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నగా.అక్కడ దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

హైదరాబాద్ లో ఓ కమర్షియల్ యాడ్ షూట్ జరుగగా.అందులో కొన్ని ఫోటోలను, వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

అందులో సమంత, చైతన్య లుక్స్ ఆకట్టుకోగా.సమంత వెండి, గులాబీ రంగులో ఉన్న పట్టు చీర, టెంపుల్ జ్యూవలరీ ధరించింది.

నాగ చైతన్య లేత నీలం రంగు షూట్ ధరించాడు.ఇక వీరిద్దరూ కలిసి స్టిల్స్ ఇవ్వగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ఇదివరకు ఓ సోప్ ప్రకటన చేయగా.ఇప్పటికీ అది బుల్లితెరలో ప్రసారమవుతుంది.

ఇక ఈ జంట ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సమంత శాకుంతలం, నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా లో నటిస్తున్నారు.

#Samantha #Naga Chaithanya #Commercial Ad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు