ఆంటీ ఛాలెంజ్ విసిరిన సమంత...

ప్రస్తుతం అక్కినేని కోడలు, నాగచైతన్య భార్య సమంత బిజీ షెడ్యుల్ తో బిజీబిజీగా గడుపుతోంది.ఇందులో భాగంగా సమంత ప్రస్తుతం జాను అనే చిత్రంలో నటిస్తోంది.

 Samantha Akkineni Super Ball Event-TeluguStop.com

ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించినటువంటి “96” చిత్రానికి రీమేక్ గా ఉంది.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

అయితే తాజాగా సమంత ప్రేక్షకులకి కొత్త ఛాలెంజ్ విసిరారు.ఇంతకీ అదేంటంటే అమెరికాలో ప్రతి సంవత్సరం జరిగే సూపర్ బల్ ఈవెంట్ అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.

అయితే తాజాగా ఈ ఈవెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, షకీరా తమ గానాలతో అదరగొట్టారు.అయితే జెన్నిఫర్ లోపెజ్, షకీరా లకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సూపర్ బాల్ ప్రారంభోత్సవంలో లో ఈ పాప్ సింగర్లు చేస్తున్నప్పటి ఫోటోలు తీసుకొని సమంత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.అంతేగాక దమ్ముంటే వీళ్ళని ఎవరైనా ఆంటీ అని పిలవండి.

అని క్యాప్షన్ కూడా పెట్టింది.

Telugu Pop Singers, Samantha, Samantha Jaanu, Shakirajennifer-Movie

అయితే దీనికి నెటిజన్లు కూడా వినూత్న రీతిలో స్పందిస్తున్నారు.వయసు పైబడిన వారిని అయితే ఆంటీలనీ అంటారు గానీ ఏంజెల్స్ ని ఆంటీలు అనరని తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.అంతేగాక మరికొందరైతే ఎర్త్ సింగింగ్ ఎంజిల్స్ అని ప్రశంసిస్తున్నారు.

అయితే ప్రస్తుతం సమంత నటించిన జాను చిత్రం ఈ నెల 7వ తారీఖున విడుదల కాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube