నిన్ను మిస్ అవుతున్నానంటూ కమెడియన్ కోసం సమంత ప్రార్థన?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప టిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ఆ తర్వాత తెలుగింటి కోడలుగా అడుగు పెట్టి మరింత గుర్తింపును సంపాదించుకుంది.పెళ్లయిన తర్వాత కూడా ఏమాత్రం సినిమాల విషయంలో వెనుకడుగు వేయని సమంత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Samantha Akkineni Special Wishes To Vennela Kishore Comedian Vennela Kishore, Sa-TeluguStop.com

అలాగే వెబ్ సిరీస్ లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అంది పుచ్చుకున్నారు.ఇలా కెరీర్లో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ముఖ్యంగా సినిమాలలో తనకు ఏమాత్రం విరామం దొరికిన తన స్నేహితులతో కలిసి అలా హాలిడే ట్రిప్ వెళుతూ ఎంజాయ్ చేస్తుంటారు.సమంతకు ఇండస్ట్రీలో కేవలం కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు.

అలాంటి స్నేహితులలో కమెడియన్ వెన్నెల కిషోర్ ఒకరు.అయితే ఆదివారం (సెప్టెంబర్ 19)వెన్నెల కిషోర్ పుట్టిన రోజు కావడంతో ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే సమంత కూడా తన స్నేహితుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu Vennela Kishore, Samantha, Wishes, Tollywood, Vennelakishore-Movie

ఈ సందర్భంగా సమంత వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.హ్యాపీ బర్త్ డే వెన్నెల కిషోర్.నేను నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.

నువ్వు ఎప్పుడు అందరినీ ఎలా నవ్విస్తావో నిన్ను కూడా కూడా అలా నవ్వించే వారి మధ్య ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.సమంత విషెస్ కు రిప్లై ఇచ్చిన వెన్నెల కిషోర్ తన విషెస్ ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని.

తనని ఎంతో మిస్ అవుతున్నానంటూ.హగ్స్ ఎమోజీ లను షేర్ చేశారు.

ఇకపోతే సమంత ప్రస్తుతం చెన్నైలో ఉంటూ గత రెండు రోజుల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీ కాళహస్తి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

స్వామివారి దర్శనం అనంతరం సమంత తిరిగి చెన్నై వెళ్లిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube