సమంత ఒంటరి ప్రయాణం.. ఎక్కడికి? ఎందుకు?

గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య విడాకుల ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తడం చేత విడిగా ఉంటున్న వీరు జీవితంలో కూడా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై సమంత, అటు నాగచైతన్య స్పందించకపోవడంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.ఇంటర్వ్యూ సందర్భంలో అనవసర విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదని సమంత చెప్పిన సమాధానం ఆ వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది.

ఇకపోతే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత తన మామయ్యకు విషెస్ చెప్పడంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని భావించారు.అయితే ఆ రోజు సాయంత్రం నాగార్జున పుట్టినరోజు వేడుకలలో సమంతా కనిపించకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

ఒకరినొకరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఒక్కసారిగా విడిపోవడానికి కారణం తెలియడం లేదు.

Advertisement

అయితే ప్రస్తుతం సమంత తనకు ప్రశాంతత కరువైందని, అందుకోసమే కొద్దిరోజులపాటు ఎవరికీ తెలియకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆమె చేస్తున్నటువంటి సినిమా షూటింగులు కూడా పూర్తికావడంతో తన పర్సనల్ స్టాఫ్ కి కూడా సమంత సెలవులు ప్రకటించిదనే వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా అందరికీ సెలవులు ప్రకటించి సమంత ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.కేవలం తన ఫిట్ నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి, పర్సనల్ డాక్టర్ మంజులతో మాత్రమే సమంత టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం సమంత గురించి వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఈ విషయంపై సమంత లేదా నాగచైతన్య స్పందించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు