నాగ చైతన్యను నిందిస్తున్న సమంత.. పోస్ట్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన అక్కినేని నాగచైతన్య సమంత వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 Samantha Akkineni Shares Gautam Buddha Quotes-TeluguStop.com

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత చేసే పోస్టులు కూడా పలు అనుమానాలకు కారణమవుతున్నాయి.ఇలా వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వీరి స్పందించకపోవడంతో అభిమానులు ఎంతో కంగారుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఈమధ్యకాలంలో ఎక్కువ ప్రేమ పెళ్లి బంధాలకు విలువలు చెప్పే మెసేజ్ లు పెట్టడం అందరిని మరింత ఆలోచింప చేయడానికి కారణం అవుతుంది.అసలు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏమిటి? వీరి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజమెంత? వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా.అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 Samantha Akkineni Shares Gautam Buddha Quotes-నాగ చైతన్యను నిందిస్తున్న సమంత.. పోస్ట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Gautam Buddha Quotes, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం సమంత ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు..నేనునిన్ను బాధపెట్టి ఉండొచ్చు ఒకరికొకరం బాధపెట్టుకొని ఉండొచ్చు అంటూ కొటేషన్స్ ఉన్న ఫోటోలు పెట్టారు.

తాజాగా సమంత బుద్ధుడి మాటలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.అందులో ఎప్పటికీ దాచలేనివి 3 ఉన్నాయి.అవి సూర్యుడు, చంద్రుడు, నిజం అనే పోస్ట్ ని షేర్ చేయడంతో దీనిలో కూడా నెటిజన్లు ఎన్నో అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.సమంత ఈ పోస్ట్ పెట్టడం వెనుక కారణం త్వరలోనే వీరి విడాకుల విషయం గురించి నిజం బయటపడనుందా.

లేకపోతే తన విషయంలో చైతన్య తప్పు చేశాడని అతనిపై నిందలు వేస్తుందా అనే విషయం గురించి నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి.

#GautamBuddha #Samantha #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు