మల్లెపూలతో దర్శనం ఇచ్చిన సమంత.. ఫోటో వైరల్..

స్టార్ హీరోయిన్లలో సమంత రూటే సపరేటు.ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు.

 Samantha Akkineni Shared A Video About Saaki World, Samantha Akkineni , Saaki Wo-TeluguStop.com

అయితే సమంత మాత్రం ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ మరోవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ పెళ్లి తరువాత కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సమంత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
లాక్ డౌన్ సమయంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలను షేర్ చేశారు.తాజాగా సోషల్ మీడియాలో సమంత మల్లెపూలు పెట్టుకున్న ఫోటో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో సమంత చాలా అందంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఈ ఫోటోలో సామ్ సూపర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.సినిమాలతో, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సమంత సాకీ వరల్డ్ పేరుతో ఫ్యాషన్ డిజైనర్ బ్రాండ్ లను ఉత్పత్తి చేస్తున్నారు.
సాకీ వరల్డ్ ద్వారా తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీ ఉత్పత్తులను అందిస్తున్నారు.ఆ ఉత్పత్తులకు సంబంధించిన శాంపిల్స్ ను తన స్నేహితులకు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు గిఫ్ట్ గా సామ్ పంపించారు.

తాజాగా ఒక వీడియోను షేర్ చేసి ఆ వీడియోలో సాకీ వరల్డ్ గురించి మల్లెపూలతో సామ్ దర్శనమిచ్చారు.సామ్ ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో పాటు ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం.లాక్ డౌన్ కు ముందే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కాగా కొన్ని రోజుల క్రితం సామ్ ఈ వెబ్ సిరీస్ లో నటించడం గమనార్హం.

ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్టీమింగ్ కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube