గొప్ప మనసు చాటుకున్న సమంత... ఏం చేసిందో తెలిస్తే?

నటి సమంత సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.నాగచైతన్య హీరోగా నటించిన ఏమాయచేసేవే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన సమంత ఏమాయ చేసావే సూపర్ హిట్ తో ఒక్కసారిగా తెలుగు పరిశ్రమ చూపును తన వైపు తిప్పుకున్న సమంత, తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కిచ్చిందని చెప్పవచ్చు.

 Samantha Akkineni Pratyusha Foundation Helping Covid Patients In Srikakulam District-TeluguStop.com

ఇక ఆ ఒక్క సినిమాతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు గడించింది సమంత.ఇక ఆ తరువాత చేసిన బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఓ బేబీ ఇంకా కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నదని చెప్పవచ్చు.

అయితే అందం, అభినయంతోనే కాక తన మంచి మనసుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సమంత.సమంత తన మంచి మనసును చాటుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.

 Samantha Akkineni Pratyusha Foundation Helping Covid Patients In Srikakulam District-గొప్ప మనసు చాటుకున్న సమంత… ఏం చేసిందో తెలిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు, అనాధ చిన్నారులకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కరోనా కష్ట కాలంలో కూడా తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తూ తన గొప్ప మనసును మరో సారి చాటుకుంటున్నది సమంత.

శ్రీకాకులం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా బాధితులకి సానిటైజర్లు, మందులు, పల్స్ ఆక్సీమీటర్లు అందజేస్తున్నది.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

సమంత గొప్ప మనసును నెటిజన్లు అభినందిస్తున్నారు.

#ViralNews #SamathaLatest #HelpingCovid #HeroineSamantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు