సమంత లవ్ స్టోరీ సినిమా చూసిందా.. మరీ ఏం చెప్పలేదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత వివాహ బంధం గురించి గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే వీరి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఈ ఇద్దరు స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

 Samantha Akkineni Not Ready See Lovestory Movi-TeluguStop.com

ఏం మాయ చేసావే సినిమా ద్వారా కలిసి నటించిన వీరు ఆ తర్వాత ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇలా ఎంతో అద్భుతమైన వీరి లవ్ స్టోరీలో ప్రస్తుతం పొరపచ్చాలు వచ్చాయని అందుకే విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా వీరి పర్సనల్ బంధం గురించి వార్తలు వస్తున్న సమయంలోనే చైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను ఆసక్తిని పెట్టుకున్నారు.అయితే తాజాగా విడుదలైన ఈ సినిమాను సమంత చూసిందా అనే ప్రశ్న ఎంతో మంది అభిమానులలో తలెత్తుతోంది.

 Samantha Akkineni Not Ready See Lovestory Movi-సమంత లవ్ స్టోరీ సినిమా చూసిందా.. మరీ ఏం చెప్పలేదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా సమంత సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

అయితే సినిమా విడుదలైన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కడ లవ్ స్టోరీ సినిమా గురించి ప్రస్తావన తీసుకురాకపోవడంతో సమంత ఈ సినిమాని చూడలేదని తెలుస్తోంది.అయితే ఈ విషయంపై సమంత సన్నిహితులు స్పందిస్తూ.ఆమె లవ్ స్టోరీ సినిమా చూసే అవకాశం లేదని ఒకవేళ చూసినా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Love Story #Samantha #Naga Chaitanya #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు