బిగ్‌బాస్ హోస్ట్‌గా స‌మంత‌కు ఎన్ని మార్కులు ప‌డ్డాయో తెలుసా?  

samantha akkineni mesmerized as bigg boss host! samantha akkineni, bigg boss host, bigg boss 4, bigg boss telugu, nagarjuna, tollywood - Telugu Bigg Boss 4, Bigg Boss Host, Bigg Boss Telugu, Nagarjuna, Samantha Akkineni, Tollywood

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారానికి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

TeluguStop.com - Samantha Akkineni Mesmerized As Bigg Boss Host

అయితే ఏడో వారం కాస్త స్పెష‌ల్‌గా, క‌ల‌ర్ ఫుల్ గా సాగింది.అందుకు కార‌ణం స‌మంత అనే చెప్పాలి.

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం మ‌నాలీ వెళ్ల‌గా.ఆయ‌న స్థానంలో స‌మంత అక్కినేని రంగంలోకి దిగింది.

TeluguStop.com - బిగ్‌బాస్ హోస్ట్‌గా స‌మంత‌కు ఎన్ని మార్కులు ప‌డ్డాయో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆదివారం నాగార్జున స్థానం‌లో వ‌చ్చిన‌ స‌మంత.షోను ర‌క్తిక‌ట్టించింది అన‌డంతో సందేహ‌మే లేదు.
ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ.వారిపై సెటైర్లు కూడా వేసింది స‌మంత‌.కేవ‌లం టాక్ బ్యాక్‌లో బిగ్ బాస్ డైరెక్టర్లు చెప్పిందే మాట్లాడకుండా.సమయస్పూర్తితో వ్యవహరించి బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ను, షో చూసే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

అలాగే ఒక్కో ఇంటి స‌భ్యుడి త‌ప్పుల‌ను త‌న‌దైన శైలిలో చెబుతూ, ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా అంద‌రికీ స‌ల‌హాలు మ‌రియు సూచ‌న‌లు ఇస్తూ, టాస్కులు ఆడిస్తూ సంద‌డి చేసిన‌ స‌మంత మామకు తగ్గ కోడలినని నిరూపించుకుంది.

ఈ షోలో సమంతకు అఖిల్ అక్కినేని, పాయల్ రాజ్‌పుత్, హైపర్ ఆది, కార్తికేయ లాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తోడై మ‌రింత హైప్ తీసుకొచ్చారు.

ఇక నాలుగు గంట‌లు ప్ర‌సార‌మైన ఈ షో ఎక్క‌డా డ్రాప్ కాకుండా చూసుకోవ‌డంలో స‌మంత బాగానే శ్ర‌మించింది.అదే స‌మ‌యంలో హోస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసింది.

ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కులు స‌మంత యాంక‌రింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.అలాగే బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత వంద‌కు దాదాపు 80 నుంచి 85 మార్కులు ప‌డ్డాయ‌ని అంటున్నారు.

మొత్తానికి బిగ్ బాస్ హోస్ట్‌గా మొద‌టి ఎపిసోడ్‌లోనే త‌న హ‌వా చూపించింది స‌మంత‌.మ‌రి రాబోయే వీకెండ్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

#Bigg Boss 4 #Nagarjuna #Bigg Boss Host

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Akkineni Mesmerized As Bigg Boss Host Related Telugu News,Photos/Pics,Images..