సామ్ వేసిన పిటిషిన్ పై నేడు విచారించనున్న కోర్టు!

Samantha Akkineni Goes To Court Against Youtube Channels

టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలిసి టాలీవుడ్ లో అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

 Samantha Akkineni Goes To Court Against Youtube Channels-TeluguStop.com

అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు అందుకే ఈ విడాకులు విషయాన్నీ అభిమానులు ఇప్పటికి జీర్ణించు కోలేక పోతున్నారు.

ఇక విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ లపైనే ద్రుష్టి పెట్టారు.

 Samantha Akkineni Goes To Court Against Youtube Channels-సామ్ వేసిన పిటిషిన్ పై నేడు విచారించనున్న కోర్టు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ వీరి విడాకుల విషయంలో మీడియా మాత్రం కొద్దిగా ఎక్కువుగానే ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది.వారిద్దరూ తమ పర్సనల్ స్పేస్ ఇవ్వాలని మీడియా వేదికగా తెలిపిన వారిపై ట్రోల్స్ మాత్రం ఆగలేదు.

ఆ ట్రోల్స్ కు సమంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది.

అయితే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం సమంత విడాకుల విషయంలో లేనిపోనివి కల్పించి థంబ్ నెయిల్స్ తో ప్రచారం చేసారు.

ఇవి సమంత దృష్టికి వెళ్లడంతో ఆమె ఈ ఛానెల్స్ పై సీరియస్ అవ్వడమే కాకుండా కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదు చేసి ఆ ఛానెల్స్ కు షాక్ ఇచ్చింది.సమంత విడాకులపై లేనిపోని ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై సమంత కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ వేసింది.

ఆ వీడియోలలో డాక్టర్ వెంకట్రావుతో పాటు తెలుగు పాపులర్ టివి, సుమన్ టీవీ, మరొక యూట్యూబ్ ఛానెల్ పై కూడా కేసు వేసింది.డాక్టర్ వెంకట్రావు తన విడాకులపై పరువుకు నష్టం కలిగించేలా ఇంటర్వ్యూ లు ఇచ్చారని తనకు లేనిపోని ఎఫైర్లు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేసారని అతడిపై మిగతా మూడు ఛానెల్స్ పై పిటిషన్ వేసింది.

వెంటనే ఆ ఛానెల్స్ తో పాటు, సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలకు సంబంధించిన అన్ని లింక్స్ ను డిలీట్ చెయ్యాలని సమంత తన పిటిషన్ లో పేర్కొంది.ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సమంత కోర్టును కోరింది.ఈ కేసుపై ఈ రోజు విచారణ జరగ బోతుంది.మరి ఆ విచారణలో కోర్టు ఏమని తీర్పు చెబుతుందో చూడాలి.

#Samantha #Chay Sam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube