‘యూటర్న్‌’కు సమంత పారితోషికం డబుల్‌ డబుల్‌..!  

  • టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పటి వరకు తన ప్రతి సినిమాకు కోటికి కాస్త అటు ఇటుగా తీసుకుంటూ వచ్చిన విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించిన ‘అల్లుడు శీను’ చిత్రానికి మాత్రం సమంత 1.75 కోట్లను తీసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సమంత కెరీర్‌లో ఇప్పటి వరకు అదే అతి పెద్ద పారితోషికంగా రికార్డు ఉంది. కాని తాజాగా యూటర్న్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. యూటర్న్‌ చిత్రంపై మోజుతో సమంత సినిమా లాభాల్లో వాటా కావాలని కోరింది.

  • Samantha Akkineni Gets Double Payment For U Turn Movie-

    Samantha Akkineni Gets Double Payment For U Turn Movie

  • నిర్మాతలు యూటర్న్‌ కోసం సమంతకు పారితోషికం కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సమంత ఇది తన ప్రొడక్షన్స్‌లో మూవీ అన్నట్లుగా ప్రమోట్‌ చేయడం జరిగింది. దాంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యింది. చిత్రం విడుదలకు ముందే లాభాలను తెచ్చి పెట్టడం వల్ల ఏకంగా సమంతకు మూడున్నర కోట్ల పారితోషికం దక్కినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున సమంత ఈ చిత్రం కోసం పబ్లిసిటీ చేయడం జరిగింది.

    తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రం విడుదల అయ్యింది. ఆ కారణంగానే సమంతకు ఇంత భారీ పారితోషికం దక్కిందని చెప్పుకోవచ్చు. సమంతకు రెండు భాషల్లో స్టార్‌ స్టేటస్‌ ఉంది. ఆ కారణంగానే ఇంతగా సమంతకు ముట్టినట్లుగా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో సమంతకు మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

  • Samantha Akkineni Gets Double Payment For U Turn Movie-
  • ‘యూటర్న్‌’ చిత్రంకు లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడితే మరో 50 లక్షల వరకు సమంతకు దక్కే అవకాశం ఉంది. అంటే సినిమా కోసం సమంత ఏకంగా నాలుగు కోట్లను దక్కించుకుందన్నమాట. ఇక సమంత ఇప్పటి వరకు తీసుకున్న పారితోషికాలకు ఇది డబుల్‌ డబుల్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.