ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఒకటి.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అమెజాన్ దీనికి సీక్వెల్ గా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తెరకెక్కించారు.ఇందులో కూడా మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సీజన్ 2 కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇందులో సమంత కూడా ముఖ్య పాత్రలో నటించడంతో సౌత్ లో కూడా ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు జూన్ 4 న స్ట్రీమింగ్ అయినా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది.ఈ సిరీస్ లో సమంత చేసిన పాత్ర గురించి నెటిజన్స్ పాజిటివ్ గా మాట్లాడు కుంటున్నారు.ఈ విషయంపై సమంత కూడా స్పందించింది.
ఒక ప్రత్యేకమైన పాత్రలో సమంత తన నటనతో అందరిని మెప్పించింది.ఈలం రెబెల్ రాజీ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిందని విమర్శకులు కూడా ప్రశంసించారు.

ద్వేషం, సురాసపై కలిసి పోరాడడానికి మనుషులంతా కలిసి రావడానికి అవసరమైన పాత్ర ఇది అని సామ్ అన్నారు.ఈ పాత్ర గురించి వచ్చిన ఫీడ్ బ్యాక్ చదివాక చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈలం తమిళులు సుదీర్ఘకాలం పాటు అనుభవించిన దుఃఖం చూసి భయపడ్డానంటూ ఆమె తెలిపారు.ఇప్పటికి బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవించే వారికీ రాజీ పాత్ర నివాళి అని ఆమె చెప్పుకొచ్చారు.