ఆ విషయంలో సమంత ఇప్పటికీ నెంబర్ 1?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి కాజల్, తమన్నా, సమంత, అనుష్క శెట్టి వంటివారు సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లగా.ఆ తర్వాత రష్మిక, రకుల్, నేడు కృతి సెట్టి హవా కొనసాగుతుందని చెప్పవచ్చు.

 Samantha Akkineni Beaten Kajal Aggarwal Ormax Media Top Ten Lists Top Telugu Heroines-TeluguStop.com

కాజల్ అగర్వాల్ సమంత సీనియర్ లిస్ట్ లోకి వెళ్ళినప్పటికీ, వివాహం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం సినిమాల విషయంలో వెనకడుగు వేయకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుని తమదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఈ విధంగా సినిమాలతో బిజీగా ఉండటం కాకుండా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ యువతను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు టాప్ 10 లిస్టులో ఉన్నటువంటి హీరో హీరోయిన్ల పేర్లను విడుదల చేసింది.మరి ఈ లిస్టు లో మన సినీతారలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయానికి వస్తే… వీరందరిలో సమంత ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.

 Samantha Akkineni Beaten Kajal Aggarwal Ormax Media Top Ten Lists Top Telugu Heroines-ఆ విషయంలో సమంత ఇప్పటికీ నెంబర్ 1-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి స్థానంలో సమంత అవకాశం దక్కించుకోగా 2 స్థానంలో వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ఉన్నారు.వీరిద్దరూ సీనియర్ హీరోయిన్స్ అయినప్పటికీ పెళ్లి చేసుకున్న సినిమాల పరంగా మొదటి రెండు స్థానాలు దక్కించుకోవడం గమనార్హం.

ఈ సర్వేలో భాగంగా ఏమాత్రం ఫామ్ లో లేనటువంటి అనుష్క శెట్టి 3 స్థానంలో ఉన్నారు.రష్మిక మందన్నా 4 వ స్థానంలో ఉండగా మిల్క్ బ్యూటీ తమన్నా 5 వ స్థానాన్ని దక్కించుకున్నారు.6 వ స్థానంలో ఉత్తమ జాతీయ నటి పురస్కారాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్ ఉన్నారు.7 వ స్థానంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఉండగా, 8 వ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.9 వ స్థానంలో రాశి ఖన్నా ఉండగా,10 వ స్థానంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఉన్నారు.ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన సర్వే ప్రకారం ఇప్పటికీ సమంత మొదటి స్థానంలో ఉండడంతో సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Sai Pallavi #Samantha #Number #Ormax #Kajal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు