కాజల్ డ్రెస్ పై సమంత కామెంట్.. ఏమన్నారంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయిన సమంత, కాజల్ అగర్వాల్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.బృందావనం సినిమాలో కాజల్, సమంత కలిసి నటించగా బ్రహ్మోత్సవం, జనతాగ్యారేజ్ సినిమాల్లో సమంత, కాజల్ కాంబినేషన్ లో సీన్లు లేకపోయినా ఇద్దరూ నటించారు.

 Samantha Akkineni Interesting Comments About Kajal Dress Acharya Movie , Kajal-TeluguStop.com

సోషల్ మీడియాలో కాజల్, సమంత యాక్టివ్ గా ఉండటంతో పాటు అభిమానులతో ఫోటోలను, సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

2017 సంవత్సరంలో సమంత నాగచైతన్యను వివాహం చేసుకోగా గతేడాది కాజల్ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు.

అయితే తాజాగా కాజల్ పాస్టెల్ గ్రీన్ ట్రౌజర్ సూట్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫోటోను చూసిన సమంత హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసి కాజల్ దిగిన ఫోటో లవ్లీగా ఉందని పేర్కొన్నారు.

సినిమాల పరంగా కాజల్, సమంత ఇద్దరూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా స్నేహితులైన కాజల్ సమంత సినిమాల విడుదల సందర్భంలో, ప్రత్యేకమైన రోజుల్లో ఒకరికి మరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు.ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవి, కాజల్ కలిసి నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.

అటు రామ్ చరణ్ కు జోడీగా కొన్ని సినిమాల్లో నటించిన కాజల్ చిరంజీవికి కూడా జోడీగా నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.ఆచార్య సినిమా మే నెల 13న విడుదల కానుండగా ఈ మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

మరోవైపు సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ సమ్మర్ లో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube