కనీసం 2022 అయినా అలా ఉండాలి.. విడాకులపై సమంత మళ్ళీ కామెంట్స్?

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.సోషల్ మీడియాలో కొటేషన్లు పెడుతూ, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 Samantha Again Reacts On Her Divorce With Naga Chaitanya Details, Samantha, Nag-TeluguStop.com

అలాగే విడాకుల తర్వాత సమంత ఏ ట్వీట్ చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.విడాకులు తరువాత సమంత పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టింది.

వరుస ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.అలాగే తన స్నేహితులతో కలిసి విహార యాత్రలో పాల్గొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

ఇక విడాకుల తర్వాత అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రోజుకు ఒక విషయాన్ని తెరమీదకు తీసుకు వస్తోంది సమంత.విడాకుల విషయం పట్ల మరొకసారి స్పందించింది సమంత.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సమంత ఆమె విడాకుల గురించి అడగగా ఆ విషయంపై స్పందిస్తూ.తన పై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు తాను విడాకుల విషయంలో స్పందించానని, ఇకపై దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, అలాగే మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ స్పష్టం చేసింది.

Telugu Divorce, Hollywood, Naga Chaitanya, Pushpa, Samantha, Samanthanaga, Tolly

ఈ ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను అని ఒక సందర్భంలో తెలిపిన సమంత.2022 లో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నట్లు తెలియజేసింది.ఇందుకోసమే సినిమాలలో డిఫరెంట్ పాత్రలను ఎంచుకుని వాటికి న్యాయం చేస్తానని కూడా తెలిపింది.ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు, స్పెషల్ సాంగ్స్, బాలీవుడ్ కి ఎంట్రీ, హాలీవుడ్ కి ఎంట్రీ అంటూ బిజీ బిజీగా ఉంది సమంత.

ఇటీవలే యశోద అనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది.అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube