ఫ్యామిలీ మెన్ 2 కోసం యాక్షన్ సీక్వెన్స్ కి రెడీ అవుతున్న సమంత  

Samantha Action Sequences Workout - Telugu Bollywood, Family Men 2 Web Series, Samantha Workout Action Sequins, South Cinema, Tollywood, Web Series

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత తన కమిట్మెంట్ తో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.కెరియర్ ఆరంభం నుంచి ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే సమంత వర్క్ ఔత్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది.

 Samantha Action Sequences Workout

ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న సమంత లేడీ ఒరియాంటెడ్ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.మరో వైపు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తుంది.

ఇక లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉంటున్న అక్కినేని కోడలు ఈ టైంని కూడా తనకి అనుకూలంగా మార్చుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తుంది.

ఫ్యామిలీ మెన్ 2 కోసం యాక్షన్ సీక్వెన్స్ కి రెడీ అవుతున్న సమంత-Movie-Telugu Tollywood Photo Image

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇందులో ఆమె పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలి అని భావించి హిందీ నేర్చుకుంది.

అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో సమంతపై యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి.దానికోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే స్పెషల్ గా ఎన్నో వర్కౌట్ లు చేస్తున్నట్లు ఓ సందర్భంలో సమంతే చెప్పుకొచ్చింది.ఈ వెబ్ సిరీస్ లో సరికొత్త సమంతను చూస్తారు అంటూ ఎంతో ధీమాగా చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత బాలీవుడ్ లోకి తాప్సి తరహాలో వెళ్లి పాగా వేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఈ అమ్మడు ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Action Sequences Workout Related Telugu News,Photos/Pics,Images..