వెంకీమామలో సమంత అంటూ పుకార్లు, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే!

వెంకటేష్‌, నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీమామ’ విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు మరింత ఆకర్షణ యాడ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాలో ఒకటి రెండు సీన్స్‌లో సమంతను నటింపజేశారంటూ వార్తలు వస్తున్నాయి.

 Samantha Act In Venky Mamma Movie-TeluguStop.com

సమంత గెస్ట్‌ అప్పియరెన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Telugu Bobby, Samantha, Samanthavenky, Samanthasmall-

నాగచైతన్య మరియు సమంతలు ఈ ఏడాది మజిలీ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.మళ్లీ వెంకీమామ చిత్రంలో వీరిద్దరి కాంబో సీన్స్‌ ఉంటాయో లేదో తెలియదు కాని, సినిమాపై అంచనాలు మాత్రం భారీగా పెరిగి పోతున్నాయి.సమంత ఈ చిత్రంలో ఉందన్న వెంటనే అంచనాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి.

అయితే సినిమా యూనిట్‌ సభ్యులను ఈ విషయమై క్లారిటీ ఇవ్వమనగా వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

Telugu Bobby, Samantha, Samanthavenky, Samanthasmall-

సమంత వెంకీమామ చిత్రంలో ఉన్నాడా లేదా అనే విషయమై మాకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటీ అంటే ఈ సినిమాలో సమంత ఒక చిన్న పాత్రలో కనిపించబోతుంది.రెండు రోజులు ఆమెపై చిత్రీకరణ చేశారట.ఫైనల్‌ ఎడిట్‌ లో ఆమె సీన్‌ ఎన్ని నిమిషాలు ఉంటుందనే తెలియాల్సి ఉంది.

సినిమా విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే సమంతకు సంబంధించిన సీన్‌ను పెంచుతారని వారు అనధికారికంగా చెప్పడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube