గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్న రాహుల్ రవీంద్రన్.. హీరోయిన్ ఆమెనే అట..!

రాహుల్ రవీంద్రన్.అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Samantha Accept With Rahul Ravindran Next Movie, Rahul Ravindran, Samantha, Sama-TeluguStop.com

అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ చూపు దర్శకత్వం వైపుగా మళ్లింది.అతడు చేసిన చిలసౌ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు.

తర్వాత రెండవ సినిమా నాగార్జునతో చేసే అవకాశం వచ్చింది.

కానీ నాగార్జునతో తీసిన సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా చేసిన మన్మధుడు 2 సినిమా ప్లాప్ టాక్ రావడంతో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వానికి పెద్ద బ్రేకులు పడ్డాయి.అప్పుడు వచ్చిన ప్లాప్ నుండి ఇప్పటికి కోలుకుని మళ్ళీ మూడవ సినిమాను తీయడానికి సిద్దమయ్యాడు.

అయితే ఈ సారి కూడా ఈయన తీసే సినిమాలో అక్కినేని సమంత నటించడానికి ఒప్పుకుందని సమాచారం.

ఈ సినిమా గీత ఆర్ట్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తుంది.

ఈయన చెప్పిన కథ నచ్చడంతో గీతా ఆర్ట్స్ వారు రాహుల్ రవీంద్రన్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ కథ లేడీ ఓరియెంటెడ్ అని తెలుస్తుంది.

రాహుల్ రవీంద్రన్ తో సమంతకు మంచి స్నేహం కూడా ఉంది.అందుకే ఈ సినిమా చేయడానికి సమంత ఒప్పుకుందని తెలుస్తుంది.

ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ హిట్స్ కూడా అందుకుంటుంది.అందుకే రాహుల్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

మన్మధుడు 2 సినిమాతో విమర్శల పాలైన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఏది ఏమైనా మామకు ప్లాప్ ఇచ్చిన రాహుల్ మరి కోడలికి హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ అసలు విషయం తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube