సమంతా తెలుగులోనే కాదు.సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్.
సినిమా కెరీర్ పరంగా మంచి సక్సెస్ లో ఉన్నా.వ్యక్తిగతం జీవితం మాత్రమే గందరగోళంగా తయారైంది.
తన తొలి సినిమా ఏమాయ చేసావే హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత నెమ్మదిగా పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.కొద్ది సంవత్సరాల తర్వాతే వీరు విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటున్నారు.వీరి విడాకులు గురించి మాత్రం చాలా గాసిప్స్ వినిపించాయి.
స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతా పిల్లల్ని కనేందుకు ఇష్టపడలేదని.అందుకే విడాకుల వరకు వ్యవహారం వచ్చిందనే మాటలు వినిపించాయి.
అయితే అవన్నీ వాస్తవాలు కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అమ్మతనం గురించి సమంత మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.
ఆడవాళ్లు చాలా స్ట్రాంగ్.ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా పెయిన్ ఫుల్ ప్రాసెస్.
ఎలాంటి ఆపరేషన్ లేకుండా డాక్టర్ రూంలో ఓ బిడ్డకు జన్మనిస్తారు.కేవలం తల్లి మాత్రమే అలాంటి బాధను అనుభవిస్తుంది.
బిడ్డను చూడగానే ఆ బాధను మర్చిపోయి నవ్వుతుందని చెప్పింది సమంతా.తల్లి కావడం తనకు చాలా ఇష్టమని వెల్లడించింది.
30 ఏండ్లకే తాను తల్లిని కావాలి అనుకుంటున్నట్లు చెప్పింది.ఎందుకంటు తన బిడ్డకు 15 ఏండ్లు వచ్చే సరికి తనతోఆడుకునే శక్తి ఉండాలన్నది.
ఈ మాటలను బట్టి విడాకులకు పిల్లలు వద్దు అని చెప్పిందనే రూమర్స్ పూర్తిగా అవవాస్తవం అని చెప్పుకోవచ్చు.
అటు విడాకుల తర్వాత సమంతా పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.ఇప్పటికే శాకుంతలంతో పాటు కాతు వాకుల రెండు కాదల్ లాంటి సినిమాలను కంప్లీట్ చేసింది.
ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ యశోద చేస్తుంది.అటు అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాకు కూడా సమంతా ఓకే చెప్పింది.