నాకు పిల్లలు కావాలనే ఉంది.. చైతూ మాత్రం ఒప్పుకోవడం లేదు  

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత రేపు ‘యూటర్న్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. సమంత నటించిన మొదటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో పాటు, థ్రిల్లర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రంకు మంచి బిజినెస్‌ జరిగింది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడుతూ పిల్లల విషయాన్ని ప్రస్తవించింది. గత సంవత్సరం నాగచైతన్యను వివాహం చేసుకున్న ఈమె పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Samantha About Having A Baby With Naga Chaitanya-

Samantha About Having A Baby With Naga Chaitanya

చాలా కాలంగా ప్రేమలో ఉన్న నాగచైతన్య మరియు సమంతలు గత ఏడాది ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటైన విషయం తెల్సిందే. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తున్నారు. ఈ సమయంలోనే సమంతను పిల్లలు ఎప్పుడు అంటూ ఒక మీడియా పర్సన్‌ అడగడం జరిగిందట. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడెప్పుడు పిల్లల్ని కనాలా అని ఎదురు చూస్తున్నాను. కాని చైతూకు మాత్రం ఇప్పట్లో పిల్లలు ఇష్టం లేదు. అందుకే నేను చైతూను ఒత్తిడి చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. చైతూ ఎప్పుడంటే అప్పుడు నేను పిల్లలను కనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

Samantha About Having A Baby With Naga Chaitanya-

నాగచైతన్య ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఊగిసలాడుతూ ఉన్నాడు. అందుకే కెరీర్‌లో సెటిల్‌ అయిన తర్వాత తండ్రి అవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత మాత్రం ఇప్పటికే స్టార్‌డంను దక్కించుకుంది. ఇంకా కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. పిల్లల కోసం ఈమె సినిమాలను వదులుకోవాలని చూస్తుంది. కాని చైతూ మాత్రం సమంతను నటించమంటూ ఎంకరేజ్‌ చేస్తున్నాడట. మంచి కథలు ఎంపిక చేసుకుని, వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తానంటూ సమంత చెబుతోంది.