మూడేళ్లుగా గర్భవతిగానే ఉన్నాను అంటున్న సమంత

సమంత, నాగచైతన్యల వివాహం అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది.అప్పటి నుండి కూడా సమంత తల్లి ఎప్పుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

 Samantha About Child In A Live Chat , Samantha, Nagachaitanya, Instgram, Akkinen-TeluguStop.com

ప్రతి మీడియా మీట్‌ లో లేదా లైవ్‌ చాట్‌ లో సమంతకు ఈ ప్రశ్న ఎదురు అవుతుంది.ఇక కొన్ని సార్లు సమంత ప్రెగ్నెంట్‌ అంటూ కూడా వార్తలు వచ్చాయి.

కాని ఇప్పటి వరకు సమంత తన ప్రెగ్నెంట్‌ విషయాన్ని క్లారిటీగా చెప్పడం లేదు.

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేనట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతోంది.

తాజాగా ఈమె ఇన్‌ స్టాగ్రామ్‌ లో అభిమానులతో చాట్‌ చేసింది.ఆ సందర్బంగా కూడా సమంత పిల్లలు ఎప్పుడు అంటూ పలువురి నుండి ప్రశ్న ఎదుర్కొంది.

అన్ని ప్రశ్నలకు కలిపి ఒకే సమాధానం ఇచ్చింది.గత మూడు సంవత్సరాలుగా నేను ప్రెగ్నెంట్‌ గానే ఉన్నాయి.

అయితే బేబీ మాత్రం బయటకు రావడం లేదు అంటూ తన పిల్లల గురించి ప్రశ్నించిన వారికి తాను ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చింది.

మొత్తానికి సమంత సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం ఈమె ది ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌లో నటిస్తోంది.అది షూటింగ్‌ పూర్తి అయ్యింది.

త్వరలో ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో ఈమె ఒక సినిమాను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది.

త్వరలో ప్రకటన చేస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube