దారుణం: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎస్పీ నేత,కుమారుడి కాల్చివేత  

Samajwadi Partyu P Chote Lall Diwakr Sunil - Telugu Chote Lall Diwakr, Police Case Registered, Samajwadi Party, Sunil, U.p

గుండాయిజం ఎంతగా పై చేయి సాధిస్తుందో ఇలాంటి సంఘటనల గురించి వింటుంటే అర్ధం అవుతుంది.గన్ పట్టుకున్నోడిదే రాజ్యం అన్నట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు.

 Samajwadi Partyu P Chote Lall Diwakr Sunil

ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.అందరు చూస్తుండగానే.

సమాజ్‌వాదీ పార్టీ నేతను, అతడి కుమారుడిని ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది.ఆ కాల్పుల దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డయ్యాయి.

దారుణం: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎస్పీ నేత,కుమారుడి కాల్చివేత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.శామ్సోయి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి.

MNERGA పథకం కింద గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి.ఐతే తమ పొలంలో గంతులు తవ్వుతున్నారనే సమాచారంతో సమాజ్‌వాదీ పార్టీ నేత చోటె లాల్ దివాకర్, ఆయన కుమారుడు సునీల్ అక్కడకు చేరుకున్నారు.

ఈ విషయమై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది.వైట్ షర్ట్, పింక్ షర్ట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులు చేతిలో పట్టుకొని సమాజ్‌వాదీ పార్టీ నేతను, ఆయన కుమారుడిని బెదిరింపులకు పాల్పడ్డారు.అయినప్పటికీ భయపకుండా తండ్రీకొడుకులు వారిని నిలదీయడం తో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు దుండగులు తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపారు.ఒకరు చోటే లాల్ దివాకర్‌ని కాల్చగా.

మరో వ్యక్తి అతడి కుమారుడు సునీల్‌ను కాల్చాడు.ఈ ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినట్లుతెలుస్తుంది.

కాల్పుల దృశ్యాలను అక్కడి స్థానికుల్లో ఒకరు రికార్డ్ చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చోటే లాల్ దివాకర్ 2017 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా ఉన్నాడని.కానీ మిత్రపక్షం కోసం ఆయన ఎన్నికల బరిలో నిలవలేదు.

అయితే ఆయన భార్య శామ్సోయి మాత్రం గ్రామ ప్రధాన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.