జాకీకి షాక్‌ ఇచ్చిన సమంత!

ప్రముఖ ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్‌ జాకీకి స్టార్‌ హీరోయిన్‌ సమంత షాక్‌ ఇచ్చింది.అంతర్జాతీయ గుర్తింపు ఉన్న జాకీ కంపెనీ ప్రతినిధులు తాజాగా సమంతతో తమ కంపెనీకి ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్లారు.

 Sam Satire On Innerwear Gossip-TeluguStop.com

అయితే వారికి అనుకోని సమాధానం ఎదురు అయ్యింది.సమంతకు జాకీ కంపెనీ ప్రతినిధులు సంవత్సర ఒప్పందానికి గాను 6 కోట్లు పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

అయితే వారి ఆఫర్‌ను తిప్పి పంపించి షాక్‌ ఇచ్చింది.

కోట్లు ఇచ్చినంత మాత్రాన ఇన్నర్‌ వేర్స్‌కు ఎలా ప్రమోషన్‌ చేస్తానని అనుకున్నారంటూ వచ్చిన ఆ జాకీ ప్రతినిధులతో ఈమె అన్నట్లుగా తెలుస్తోంది.

మొదట సమంత ఈ అగ్రిమెంట్‌ను సైట్‌ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

దాంతో సమంత జాకీ కంపెనీకి ప్రచారం చేయబోతుందని ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలను సమంత ఖండిరచింది.

తాను జాకీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తాను అలాంటి బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా చేయనని తేల్చి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube