నయనతార సమంత కేఆర్ కే ఓటీటీ రిలీజ్ డేట్ లాక్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన చిత్రం కాతువాకుల రెండు కాదల్.ఈ సినిమా షూటింగ్ సమయంలో కేవలం తమిళ భాషలో మాత్రమే విడుదల చేయాలని భావించారు.

 Sam Nayan Good News For Telugu Fans, Samantha , Nayanatara, Tollywood, Vijay Sethupathi , Krk , Disney Plus Hot Star-TeluguStop.com

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నయనతార విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని భావించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి విడుదల ముందు తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా హడావిడిగా విడుదల చేశారు.

ఇక ఈ సినిమా తెలుగులో కే ఆర్ కే పేరుతో విడుదల చేశారు.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక స్టార్ హీరో ఉన్నప్పటికీ పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను చేయకపోవడం వల్ల ఈ సినిమా థియేటర్లు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

 Sam Nayan Good News For Telugu Fans, Samantha , Nayanatara, Tollywood, Vijay Sethupathi , KRK , Disney Plus Hot Star-నయనతార సమంత కేఆర్ కే ఓటీటీ రిలీజ్ డేట్ లాక్#8230; స్ట్రీమింగ్ ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు.ఇక ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయటానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార సమంత విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా తమిళంలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టినప్పటికి తెలుగులో ప్రేక్షకాదరణ పొందలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube