దర్శకురాలికి కష్టాలు తెచ్చిన సామ్, చైతూ విడాకులు.. కారణం?

Sam And Cahitu Divorce Brought Difficulties To The Director Do You Know The Reason

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకుని విడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో చాలామంది దిగ్భ్రాంతికి లోనయ్యారు.

 Sam And Cahitu Divorce Brought Difficulties To The Director Do You Know The Reason-TeluguStop.com

ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకూ వెల్లడించలేదు.ఇకపోతే విడాకుల తర్వాత ఈ జంట కు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

విడాకులు తీసుకొని రెండు మూడు నెలలు కావస్తున్నా కూడా ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.ఇక నాగచైతన్య విషయం పక్కన పెడితే.

 Sam And Cahitu Divorce Brought Difficulties To The Director Do You Know The Reason-దర్శకురాలికి కష్టాలు తెచ్చిన సామ్, చైతూ విడాకులు.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో రకమైన పోస్ట్ లు పెడుతూనే ఉంది.

విడాకుల తర్వాత సమంత ఆ బాధ నుంచి కోలుకోవడానికి కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇదిలాఉంటే ఇటీవల నాగ చైతన్య విడాకుల విషయం గురించి స్పందిస్తూ.సమంత మంచి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.వారి విడాకుల వ్యవహారం వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ.

వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఒక ప్రముఖ డైరెక్టర్ నష్టపోయినట్లు తెలుస్తోంది.ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి.

నందిని రెడ్డి ఓ బేబీ సినిమా తో సమంతకు ఒక మంచి హిట్ ను ఇచ్చింది.

Telugu Chaitau, Divorce, Samantha, Tollywood-Movie

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోక ముందు, ఓ బేబీ సినిమా సమయంలోనే వీరిద్దరితో ఒక మూవీ తెరకెక్కించాలని నందిని రెడ్డి ప్లాన్ చేసిందట.కథ కూడా అనుకున్నట్లు తెలుస్తోంది.ఇక అందుకు సంబంధించిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న క్రమంలోనే ఆ జంట వారు విడిపోతున్నట్లు ప్రకటిస్తూ నందిని రెడ్డి కి పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విడాకుల తరువాత సమంత,నాగచైతన్య ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ అయిపోయారు.ఇప్పటివరకు వారు కలిసి మాట్లాడుకున్న సంఘటన కాదు కదా బర్త్ డే కి కూడా విషెస్ చేయనంత గా ఈ జంట నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం బట్టి నందిని రెడ్డి సినిమా ఆగిపోయినట్లే అని తెలుగు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో నందిని రెడ్డి పలు కష్టాలను కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

#Divorce #Samantha #Chaitau

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube