మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

ఉప్పు లేని కూరలు అస్సలు తినలేం.ముఖ్యంగా ఇండియన్స్‌ దాదాపు ప్రతి వంటకంలో కూడా ఉప్పు వేస్తూనే ఉంటారు.

 Salt, Human Health, Heart Attack, Sodium, Cholesterol, Health Tips, Salt For Hea-TeluguStop.com

ఒక్క స్వీట్స్‌ మినహా ప్రతి ఒక్క వంటకంను ఉప్పు లేకుండా అస్సలు చేయరు అనే విషయం తెల్సిందే.ఉప్పు లేకుండా వంటకాలు చేసినా కూడా అవి అంతగా టేస్టును కలిగి ఉండవు.

అందుకే ప్రతి వంటకంలో కూడా తప్పనిసరిగా ఉప్పును వాడుతూనే ఉంటారు.ఒక సర్వే ప్రకారం ఇతర దేశస్తులతో పోల్చితే మన దేశస్తులు ఉప్పును అధికంగా తీసుకుంటున్నట్లుగా వెళ్లడయ్యింది.

ఉప్పు మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రధాయనిగా పని చేస్తుంది.కాని అమితంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యంను నాశనం చేస్తుందని వైధ్యులు అంటున్నారు.తాజాగా యూఎస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ వారు చేసిన ఒక సర్వేలో ఆశ్చర్యకర విషయం ఒకటి వెళ్లడి అయ్యింది.దాని ప్రకారం ఉప్పు ఎక్కువగా ఎవరు తింటారో వారు గుండె పోటుకు గురి అయ్యే అవకాశం ఉంది అంటూన్నారు.

ఉప్పు ఎక్కువగా తినే వారి రక్త నాళాలు జామ్‌ అవుతున్నాయని, తద్వారా గుండె పోటుకు దారి తీస్తున్నట్లుగా పలు అధ్యాయాల ద్వారా వెళ్లడి అయ్యింది.

Telugu Cholesterol, Tips, Heart Attack, Salt, Sodium-Telugu Health

ఉప్పు ఎక్కువ తినడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు విపరీతంగా పెరుగుతాయని, తద్వారా శరీరంలో కొవ్వు పేరుకు పోయి గుండె చుట్టుతా కూడా కొవ్వు జమ అవ్వడం వల్ల చివరకు గుండె పోటు వస్తుందని వైధ్యులు అంటున్నారు.శరీరానికి ఉప్పు అవసరం ఉంది కాని అది ఎక్కువ అయితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని వైధ్యులు అంటున్నారు.కాస్త జాగ్రత్త పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

మీరు ప్రతి కూరలో, చారులో ఉప్పును అధికంగా తింటూ ఉంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube