పాపం సలోని పృధ్వితో సరిపెట్టుకుంటుంది..!

టాలీవుడ్ చాలామంది హీరోయిన్స్ కు లక్కీ అయితే కొంతమంది హీరోయిన్స్ కు అన్ లక్కీ.సినిమాలు చేస్తున్న క్రేజ్ సంపాదించడంలో మాత్రం వెనుకడువేస్తుంటారు.

 Saloni Pair With Thirty Years Prudhvi-TeluguStop.com

ఇక వారిలో సలోని కూడా ఉంటుంది.తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మర్యాద రామన్న సినిమాతో మొదటి హిట్ అందుకుంది.

రాజమౌళి లాంటి దర్శకుడే ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక కెరియర్ స్పీడ్ అందుకుంటుంది అనుకుంటే ఆ తర్వాత కూడా చిన్న చితకా సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు ఆ అవకాశాలు కూడా రాకపోయే సరికి థర్టీ ఇయర్స్ పృధ్వికి జంటగా ఓ సినిమాలో నటిస్తుంది.

నవీన్ చంద్ర, శృతి సోధి జతగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంలో ఓ సినిమా వస్తుంది.ఆ సినిమాలో పృధ్విది దాదాపు ఈక్వల్ టు హీరో పాత్ర అట.సో అలాంటి రోల్ కు పెయిర్ గా సలోనిని ఓకే చేశారు దర్శక నిర్మాతలు.ప్రస్తుతం ఫాంలో ఉన్న పృధ్వి సలోనితో జతకడతానని ఊహించి ఉండడు.

కెరియర్ ఊపు మీదుంటే సలోని ఏంటి కావాలంటే సమంతతో కూడా స్టెప్పులేయిస్తారు దర్శక నిర్మాతలు.రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని సలోని ఏవిధంగా వినియోగించుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube