స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సల్మాన్  

Salman Khan Introduce Ashwami Manjrekar-

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన సల్మాన్ ఎంతో మంది హీరోయిన్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.ఇప్పటికీ కూడా పలువురిని పరిచయం చేస్తూనే ఉన్నాడు...

Salman Khan Introduce Ashwami Manjrekar--Salman Khan Introduce Ashwami Manjrekar-

ఐతే తాజాగా దబాంగ్-3 సినిమా కోసం మహేష్ మంజ్రేకర్ కూతురిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేస్తుండగా మరో హీరోయిన్ గా మహేష్ కుమార్తెను ఎంపిక చేసినట్లు సమాచారం.దీనికి కారణం లేకపోలేదు.ఎప్పుడో పదేళ్ల క్రితం తన స్నేహితుడు మహేష్ మంజ్రేకర్ కి సల్మాన్ ఒక ప్రామిస్ చేసాడట.

ఆ ప్రామిస్ ప్రకారం తప్పకుండా నీ కూతురు అశ్వమి మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయం చేస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం సల్మాన్ తన మాట నిలబెట్టుకున్నాడు.బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ 5 పదుల వయసులో కూడా పలు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Salman Khan Introduce Ashwami Manjrekar--Salman Khan Introduce Ashwami Manjrekar-

అయితే దబాంగ్ సినిమా సీక్వెల్ తీస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ని ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా తొలుత వేరే వారిని అనుకున్నప్పటికీ చివరగా మంజ్రేకర్ కుమార్తెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.మొత్తానికి స్టార్ హీరో అయినప్పటికీ సల్మాన్ తన స్నేహితుడి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.