ఆ స్టార్ హీరో కోసం భారీ రెమ్యునరేషన్ వదులుకున్న సల్మాన్ ఖాన్!

సినీ ఇండస్ట్రీలో నటీనటులు కేవలం నటన వరకే పరిమితం కాదు.బయట కూడా మంచి స్నేహితులుగా మిగిలిపోతారు.

 Salman To Pathan Amitabh Bachchan To Saira-TeluguStop.com

ఇలా ఎంతోమంది నటీనటులు సినీ ఇండస్ట్రీలో సహ నటులతో స్నేహ బంధాన్ని పెంచుకుంటూపోతారు.అంతేకాకుండా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా తమ నటుల స్నేహితులతో కలిసి పాల్గొంటారు.

ప్రస్తుతం ఇలా ఎంతో మంది స్నేహితులు సినీ పరిశ్రమ లో ఉండగా.మరో హీరో సల్మాన్ ఖాన్ ఏకంగా ఆ హీరో కోసం రెమ్యూనరేషన్ వదులుకున్నాడు.

 Salman To Pathan Amitabh Bachchan To Saira-ఆ స్టార్ హీరో కోసం భారీ రెమ్యునరేషన్ వదులుకున్న సల్మాన్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.

టాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.

ఇక షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమా లో సల్మాన్ ఖాన్ అతిధిపాత్రలో నటించాడట.అది కూడా పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనగా.

ఆ సినీ నిర్మాత ఆదిత్య చోప్రా సల్మాన్ ఖాన్ కు అతిధి పాత్ర కు పారితోషకాన్ని అందివ్వగా.సల్మాన్ ఖాన్ దానికి నిరాకరించాడని తెలిసింది.

కారణం షారుక్ ఖాన్ తనకు సోదరుడిలాంటివాడని, తన కోసం ఏదైనా చేస్తానంటూ తెలిపాడు.కానీ నిర్మాత మాత్రం ప్రొఫెషనల్ విషయంలో ఆయనకి పారితోషకాన్ని అందివ్వడానికి పట్టుబడ్డాడు.

కానీ సల్మాన్ దానికి నిరాకరించగా.తనకు ఇవ్వాలనుకున్న డబ్బును యష్ రాజ్ సంస్థ నిర్మించే టైగర్ సినిమా బడ్జెట్ లో చేర్చామని కోరాడు.

ఇక ఈ విషయం గురించి నిర్మాత షారుక్ ఖాన్ కు తెలపగా షారుక్ కూడా ఆశ్చర్యపోలేదట.అంతేకాకుండా ‘భాయ్ తో భాయ్ హై’ అని అన్నారట.ఇక ఈ సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో నటించగా.ఆ పాత్ర సినిమా విలువను పెంచుతుందని నిర్మాత తెలిపారు.ఇక ఈ సన్నివేశాలను ముంబైలో వై ఆర్ ఎఫ్ స్టూడియోలో పూర్తి చేశారని తెలిపారు.గతంలో కూడా మరో బాలీవుడ్ హీరో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి సినిమాలో తమ స్నేహబంధం కోసం పారితోషకాన్ని తీసుకోలేదని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

#Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు