రాధే సినిమా విషయంలో వారికీ క్షమాపణలు చెప్పిన సల్మాన్..!

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ వరస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన ‘రాధే‘ సినిమా చేస్తున్నాడు.

 Salman Talks Radhe Ott Release-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Salman Talks Radhe Ott Release-రాధే సినిమా విషయంలో వారికీ క్షమాపణలు చెప్పిన సల్మాన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా ఈ సినిమాను రంజాన్ కానుకగా మే 13 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది.అయితే ఈ సినిమాను థియేటర్స్ లోను ఓటిటి లోనూ ఒకే రోజు విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం ( డీజే ) సినిమాలోని సీటిమార్ సాంగ్ ను హిందీలో రీమేక్ చేసి ఈ సినిమా కోసం ఉపయోగించారు.

Telugu Ott Release, Radhe Movie, Salman Khan, Salman Talks Radhe Ott Release-Movie

సల్మాన్ ఖాన్ ఈ సాంగ్ కు స్టెప్పులు కూడా వేసాడు.అల్లు అర్జున్ తో పోటీగా చేయలేక పోయిన సల్మాన్ కూడా పర్వాలేదనిపించారు.ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ అతలాకుతలం అవుతుంది.ఈ పరిస్థితులలో కూడా సల్మాన్ మాట ఇచ్చినట్టుగా ఈద్ కానుకగా రాధే సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కష్ట కాలంలో లాభాలతో సంభంధం లేకుండా అందరికి చెప్పినట్టు ఈ సినిమాను విడుదల చేస్తున్నానని.తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూడాలని ఆయన జూమ్ మీటింగ్ లో తెలిపారు.

ఈ సందర్భంగా పంపిణీ దారులకు కూడా ఆయన క్షమాపణలు తెలిపారు.ఈ పరిస్థితుల నుండి బయట పడిన తర్వాత ప్రజలు ఈ సినిమాను ఇష్టపడితే మళ్ళీ పెద్ద తెరపై విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం అని సల్మాన్ తెలిపారు.

#Salman Khan #OTT Release #SalmanTalks

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు