కత్రినా పెళ్లి గురించి స్పందించిన సల్మాన్ సోదరి అర్పిత..!

Salman Sister Arpita Responds To Katrina Wedding

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

 Salman Sister Arpita Responds To Katrina Wedding-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరి పెళ్లి కేవలం బంధువులు అత్యంత సన్నిహితుల మధ్య జరగనుందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

 Salman Sister Arpita Responds To Katrina Wedding-కత్రినా పెళ్లి గురించి స్పందించిన సల్మాన్ సోదరి అర్పిత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కత్రినా కైఫ్ తన దృష్టిని కెరియర్ పై పెట్టడం వల్ల అతని తో బ్రేక్ అప్ చెప్పుకుంది.

ఇలా సల్మాన్ తో బ్రేకప్ చెప్పుకున్న కత్రినా ఆ తర్వాత తనతో కలిసి పలు సినిమాలలో నటించారు.అదేవిధంగా వీరిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గోన్నారు.

ఇక సల్మాన్ తో తనకి బ్రేకప్ అయినప్పటికీ కత్రినాకైఫ్ వివాహానికి సల్మాన్ కుటుంబం మొత్తం వస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించిన ఈ విషయంపై సల్మాన్ సోదరి అర్పితా స్పందించారు.

Telugu Arpita, Bollywood, Katrina, Responds, Salman Khan, Sister-Movie

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కత్రినాకైఫ్ వివాహానికి మాకు ఆహ్వానం అందిందని కుటుంబమంతా కలిసి వెళ్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే తమ కుటుంబానికి కత్రినాకైఫ్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని,ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అర్పితా వెల్లడించారు.అయితే పెళ్లికి మరికొన్ని రోజులు సమయం ఉండటంతో ఈలోగా తన కుటుంబానికి కత్రినాకైఫ్ ఆహ్వానం పంపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

#Arpita #Responds #Sister #Salman Khan #Katrina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube