ఆ సినీ విమర్శకుడికి స్టార్‌ హీరో పీఆర్‌ హెచ్చరిక

బాలీవుడ్‌లో చాలా ఫేమస్‌ అయిన సినీ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌.ఈయన కొన్ని సినిమాల్లో నటించాడు కూడా.

 Sushanth, Kamal R Khan, Salman Khan, Bollywood Industry, Sushanth Death,salman P-TeluguStop.com

సోషల్‌ మీడియాలో సినిమాల రివ్యూలు రాయడం అప్పుడప్పుడు సినిమాల్లో నటించడం, స్క్రిప్ట్‌ రైటింగ్‌లో రచయితలకు సాయం చేస్తూ ఉండటం ఈయన పని.వివాదాస్పద విషయాల్లో వర్మ మాదిరిగా తల దూర్చుతూ మాట్లాడే వ్యక్తి ఈయన.ఇటీవల సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రముఖులపై ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.బాలీవుడ్‌లో ఉన్న కొందరి కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ విమర్శలు గుప్పించాడు.

సల్మాన్‌తో పాటు పలువురు స్టార్స్‌ను టార్గెట్‌ చేసి కమల్‌ ఆర్‌ ఖాన్‌ కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో చిక్కుల్లో పడ్డాడు.సల్మాన్‌ ఖాన్‌ పీఆర్‌ టీం వెంటనే కమల్‌ ఆర్‌ ఖాన్‌తో మాట్లాడారట.

సుశాంత్‌ మరణంకు సల్మాన్‌ ఎలా బాధ్యుడు అవుతాడని విమర్శలు చేస్తున్నావు అంటూ హెచ్చరించారట.ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే పరువునష్టం దావా వేయాల్సి వస్తుందంటూ బెదిరించారట.

దాంతో కమల్‌ ఆర్‌ ఖాన్‌ తన వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో మరోసారి వివరణ ఇవ్వడం జరిగింది.

నేను సుశాంత్‌ ఆత్మహత్యకు కారణం సల్మాన్‌ ఖాన్‌ అన్నట్లుగా ట్విట్టర్‌లో కాని వీడియో కాని చూపించగలరా.

నేను అనకుండానే నన్ను బెదిరించడం ఏంటీ.మీ పీఆర్‌ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాడు.

ఇండస్ట్రీలో ఎంతో మంది సుశాంత్‌ మరణంకు కారణం అన్నాను తప్ప ఏ ఒక్కరి పేరు నేను చెప్పలేదు.మీడియాలో వస్తున్న వార్తలకు నేను బాధ్యుడిని కాదు.

మీడియా అనేది నా చేతిలో లేదు.వారు నేను అన్నట్లుగా కథనాలు రాస్తే నా బాధ్యత ఎలా ఉంటుందని కమల్‌ ప్రశ్నించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube